AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..!

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. కొత్త కోచ్‌లను ఇప్పటికే ఉన్న రైళ్లకు జోడించకుండా రూట్ అవసరాలు,ప్రయాణికుల రద్దీని బట్టి మూడు, నాలుగు లేదా ఆరు కోచ్‌ల కాన్ఫిగరేషన్‌లను లేదా మల్టీ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని, అలాగే..

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..!
Subhash Goud
|

Updated on: Nov 12, 2025 | 7:53 AM

Share

Hyderabad Metro: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కారణంగా మెట్రో రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగరంలో మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రయాణించాలంటేనే ట్రాఫిక్‌ సమస్య. అలాంటిది మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) తన అత్యంత రద్దీ మార్గాల్లో నాలుగు కోచ్‌లు, ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. నగరంలో పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల నుండి సంవత్సరాల తరబడి వచ్చిన అభ్యర్థనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

ప్రస్తుతం, హైదరాబాద్ మెట్రో దాని మూడు కారిడార్లలో ఒక్కొక్కటి మూడు కోచ్‌లతో 56 రైళ్లను నడుపుతోంది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నుండి మెట్రోలు నాలుగు, ఆరు, ఎనిమిది కోచ్‌లతో నడుస్తాయని ఉదాహరణలను ఉటంకిస్తూ హైదరాబాద్‌ మెట్రో సామర్థ్యాన్ని పెంచాలని ప్రయాణికులు చాలా కాలంగా అధికారులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పీక్ ఆవర్స్‌లో 5 నిమిషాలకో ట్రైన్, రద్దీ లేని సమయంలో 10.12 నిమిషాలకో ట్రైన్ నడుస్తుండగా.. త్వరలోనే 2 నిమిషాలకో ట్రైన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మెట్రో ప్రయత్నాలు చేస్తోంది. నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెట్రో రైలు కోచ్‌ల సంఖ్య పెంపు నిర్ణయాన్ని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) పరిశీలిస్తోంది. ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో బిజీ రూట్లలో నాలుగు, ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టేందుకు మెట్రో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇతర కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీసం 40 నుంచి 60 అదనపు కోచ్‌లను సేకరించాలని హైదరాబాద్‌ మెట్రో నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Water Heater: వాటర్‌ హీటర్‌పై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఇలా చేస్తే కొత్తగా మారుతుంది!

హైదరాబాద్‌ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. కొత్త కోచ్‌లను ఇప్పటికే ఉన్న రైళ్లకు జోడించకుండా రూట్ అవసరాలు,ప్రయాణికుల రద్దీని బట్టి మూడు, నాలుగు లేదా ఆరు కోచ్‌ల కాన్ఫిగరేషన్‌లను లేదా మల్టీ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని అన్నారు. ఈ కోచ్‌లను దేశంలోని మూడు ప్రముఖ మెట్రో తయారీ యూనిట్లైన ఆల్‌స్టోమ్, బీఈఎంఎల్ లిమిటెడ్, టిట్లఘర్ రైల్ సిస్టమ్స్ నుంచి సేకరించనున్నట్లు తెలిపారు. ఎక్కువ కోచ్‌లను ప్రవేశపెట్టడం వల్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని అన్నారు. రెండు రైళ్ల మధ్య సమయాన్ని రెండు నిమిషాలకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, దీని వల్ల కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు, విద్యార్థులకు ముఖ్యంగా పీక్ అవర్స్‌లో జర్నీ చేసేవారికి ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ కొత్త కోచ్‌లు హైదరాబాద్‌కు చేరుకోవాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: EPFO: మీరు ఉద్యోగం మానేసిన తర్వాత మీ పీఎఫ్‌ ఖాతా క్లోజ్‌ అవుతుందా? మీ ప్రశ్నకు జవాబు ఇదే!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి