AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Heater: వాటర్‌ హీటర్‌పై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఇలా చేస్తే కొత్తగా మారుతుంది!

Water Heater: ఈ తెల్లటి పొర నీటిలో ఉండే ఖనిజాలు కారణంగా ఏర్పడుతుందని చెబుతున్నారు టెక్‌ నిపుణులు. నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, రాడ్ నీటిని వేడి చేసినప్పుడు ఆ రాడ్‌పై గట్టిగా అతుక్కుపోయి తెల్లటి పొరగా..

Water Heater: వాటర్‌ హీటర్‌పై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఇలా చేస్తే కొత్తగా మారుతుంది!
Subhash Goud
|

Updated on: Nov 12, 2025 | 7:20 AM

Share
Water Heater: చలికాలం ప్రారంభమైంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. ఈ కాలంలో వేడి నీళ్లు కావాలంటే చాలా మంది హీటర్లను వాడుతుంటారు. నీటిని వేడి చేయడానికి గ్యాస్ గీజర్‌లు లేదా ఇమ్మర్షన్ హీటింగ్ రాడ్లను ఉపయోగిస్తారు. ఇమ్మర్షన్ రాడ్ ధర చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యధిక శాతం ప్రజలు దీనినే ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ రాడ్‌ను పదేపదే ఉపయోగించడం వల్ల దానిపై తెల్లటి పొర లాంటిది పేరుకుపోతుంటుంది.
అయితే ఈ తెల్లటి పొర నీటిలో ఉండే ఖనిజాలు కారణంగా ఏర్పడుతుందని చెబుతున్నారు టెక్‌ నిపుణులు. నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, రాడ్ నీటిని వేడి చేసినప్పుడు ఆ రాడ్‌పై గట్టిగా అతుక్కుపోయి తెల్లటి పొరగా ఏర్పడుతుంది. ఈ పొర రాడ్ ఉత్పత్తి చేసే వేడిని నీటి వరకు చేరకుండా అడ్డుకుంటుంది. దీని ఫలితంగా నీరు వేడెక్కడానికి రాడ్‌కు సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల విద్యుత్‌ బిల్లు కూడా పెరిగిపోతుంటుంది. కరెంటు బిల్లును ఆదా చేసుకోవాలంటే హీటర్‌ రాడ్‌పై ఉన్న తెల్లటి పొరను తొలగించడం చాలా ముఖ్యం. దీనిని సులభంగా శుభ్రం చేయడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
  1. కిరోసిన్ నూనె: ఈ తెల్లటిపొరను తొలగించాలంటే ముందుగా రాడ్‌ను పూర్తిగా చల్లగా ఉండాలి. తెల్లటి పొరపై కిరోసిన్ నూనెను బాగా రాయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయండి. కిరోసిన్ నూనె ఆ గట్టి పొరను మెత్తబరుస్తుంది. ఆ తర్వాత ఆ రాడ్‌పై తడిగుడ్డతో రుద్దితే తెల్లటి పొర పొడిపొడిగా రాలిపోతుంది. కిరోసిన్ నూనె సహాయంతో ఆ తెల్లటి పొర సులభంగా తొలగిపోతుంది.
  2. హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం: 2 లీటర్ల నీటిలో 5-6 చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి. ఈ ద్రావణంలో హీటింగ్ రాడ్‌ను కొంతసేపు ముంచి ఉంచండి. ఈ ద్రావణం తెల్లటి పట్టీని తొలగించడంలో సహాయపడుతుంది. తర్వాత నీటితో కడగండి.
  3. నిమ్మకాయ, ఉప్పు, సున్నం:  హీటర్‌ రాడ్‌పై తెల్లటి పొర పోగొట్టేందుకు ఉప్పు, సున్నం కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఉప్పు, సున్నం కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.సున్నం కలపడం వల్ల  తెల్లటి పొర పోయేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ పేస్ట్‌ను రాడ్‌పై బాగా పూయండి. మూడు, నాలుగు నిమిషాల తర్వాత  సగం నిమ్మకాయతో రాడ్‌పై రుద్దండి. అప్పుడు తెల్లటి పొర సులభంగా ఊడివస్తుంది.
  4. బేకింగ్ సోడా, వెనిగర్: బేకింగ్ సోడాను అత్యుత్తమంగా పని చేస్తుంది. ఒక బకెట్‌లో కొన్ని నీళ్లు తీసుకుని అందులో బేకింగ్ సోడా, వెనిగర్ కలపండి. రాడ్‌ను ఈ ద్రావణంలో 4-5 నిమిషాలు ఉంచి, ఆపై బ్రష్‌తో మెత్తగా రుద్దండి. ఇలా చేస్తే తెల్లటి పొర రాలిపోతుంది. ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా హీటర్‌పై ఏర్పడిన తెల్లటి పొర సులభంగా పోగొట్టవచ్చు.
  5. ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: EPFO: మీరు ఉద్యోగం మానేసిన తర్వాత మీ పీఎఫ్‌ ఖాతా క్లోజ్‌ అవుతుందా? మీ ప్రశ్నకు జవాబు ఇదే!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?