Jupalli Krishna Rao: తెలంగాణలో కొత్త కంపెనీ బీర్లు.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమన్నారంటే..
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లపై రాజకీయ దుమారం రేగింది.. కొత్త మద్యం బ్రాండ్లకు రేవంత్ సర్కార్ అనుమతులు ఇచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడం, కొత్త మద్యం బ్రాండ్లపై వస్తున్న విమర్శలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లపై రాజకీయ దుమారం రేగింది.. కొత్త మద్యం బ్రాండ్లకు రేవంత్ సర్కార్ అనుమతులు ఇచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడం, కొత్త మద్యం బ్రాండ్లపై వస్తున్న విమర్శలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్‌కు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు జూపల్లి కృష్ణారావు చెప్పారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ దగ్గరకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. BRS ప్రభుత్వ హయాంలోనే నాలుగేళ్ల కిందట కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారంటూ వివరించారు. ప్రొసీజర్ ప్రకారమే బెవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయాలు తీసుకుంటుందనీ, కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తన దృష్టికి రావని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.
కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని గతంలో ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు జూపల్లి వివరించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. నిర్ణయం తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఉందని.. దాని ప్రకారమే అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. డిమాండ్ – సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బేవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తుందని గుర్తించాలని సూచించారు. సోమ్ డిస్టిలరీస్ రెండు దశాబ్దాలుగా.. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సరఫరా చేస్తోందని.. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారంటూ గుర్తు చేశారు. బేవరేజెస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2021-22లో 75 లిక్కర్, 8 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2022-23లో 122 లిక్కర్ బ్రాండ్లు, 11 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2023-24లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీర్ బ్రాండ్ల కంపెనీలకు గత ప్రభుత్వం అనుమతులిచ్చిందంటూ మంత్రి జూపల్లి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
