AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మండే ఎండల్లో కూల్ న్యూస్.. హైదరాబాద్‌లో చల్లని జల్లులు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

Hyderabad weather forecast: మొన్నటివరకు వర్షాలు పడటంతో ఎండల నుంచి నగరవాసులకు రిలీఫ్ లభించింది. ఇప్పుడు మరోసారి.. సూర్యుడు చెలరేగిపోతున్నాడు. ఉదయం 10 తర్వాత బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చేసింది.. వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం...

Hyderabad: మండే ఎండల్లో కూల్ న్యూస్.. హైదరాబాద్‌లో చల్లని జల్లులు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Telangana WeatherImage Credit source: NAGARA GOPAL
Ram Naramaneni
|

Updated on: May 29, 2024 | 3:47 PM

Share

జూన్ 1వ తేదీ శనివారం నాడు నగరంలోని మొత్తం ఆరు జోన్లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా ఐఎండీ తెలిపింది. శుక్రవారం నగరంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. అయితే గురువారం ఉష్ణోగ్రత 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌లో ఉండవచ్చని వెల్లడించింది. హైదరాబాద్‌లో శనివారం వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రానున్న కొద్దిరోజుల పాటు వర్షాలు కురిసే పడే సూచనలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సకాలంలో రుతుపవనాల గురించి IMD అంచనా వేసినందున త్వరలో రెయినీ సీజన్ షురూ అవ్వనుంది. వేసవి తాపంతో అల్లాడుతున్న హైదరాబాద్‌లో రిలీఫ్ కలిగించే వార్తే ఇది.  వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది.  సాధారణంగా, హైదరాబాద్‌లో వర్షాకాలం జూన్ మధ్య నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. వేసవి వేడి నుండి స్థానికులకు ఉపశమనం లభిస్తుంది. గతేడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 615.4 మిల్లీమీటర్లు దాటి 769.5 మిల్లీమీటర్ల సంచిత వర్షపాతం నమోదైంది. నగరం మొత్తం మీద ‘అదనపు’ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లోని మండలాల్లో షేక్‌పేట, మారేడ్‌పల్లి, చార్మినార్, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి మండలాల్లో నగర సగటు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!