AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad: రైల్వే స్టేషన్‌లో తేడాగా కనిపించిన ప్యాసింజర్.. అతని లగేజ్ చెక్ చేయగా..

కంత్రీగాళ్లు.. ఖతర్నాక్ గాళ్లు.. ఇంకా ఏం పేర్లు పెట్టాలి వీళ్లకి. క్రైమ్ చేయడానికి వినూత్న మార్గాలను ఎన్నుకుంటున్నారు. కొంచెం కూడా భయం లేకుండా తమ పనులు కానిచ్చేస్తున్నారు. రైళ్లను,. బస్సులను కూడా అక్రమ కార్యాకలాపాలకు వినియోగించుకుంటున్నారు.

Secunderabad: రైల్వే స్టేషన్‌లో తేడాగా కనిపించిన ప్యాసింజర్.. అతని లగేజ్ చెక్ చేయగా..
Secunderabad Railway Station
Ram Naramaneni
|

Updated on: May 29, 2024 | 6:03 PM

Share

కంత్రీగాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కూడా వదలడం లేదు. ఆర్టీసీ బస్సులను, రైళ్లను కూడా తమ అక్రమ కార్యకలాపాలకు యధేచ్చగా వినియోగించుకుంటున్నారు. పోలీసులు అంటే కనీసం భయం లేకుండా పోయింది. ఇంతలా తనిఖీలు జరుగుతున్నా కూడా తమను ఆపేవాడే లేడు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో  గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15.5 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చాంద్ కుమార్ నాయక్ (30)గా గుర్తించారు. అతడిని అక్కడికక్కడే అరెస్టు చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

నాయక్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సోమవారం ఉదయం ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఒడిశాలోని మోహనా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు గంజాయిని తరలిస్తుండగా నాయక్‌ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. నిషిద్ధ వస్తువులు ఉన్న రెండు ట్రాలీ సూట్‌కేసులు, మూడు షోల్డర్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చిదాతో పాటు మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ షేక్ సలీమా, ఆమె డిప్యూటీ ఎస్ఎన్ జావేద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. సికింద్రాబాద్‌ జీఆర్‌పీ అధికారులు, సిబ్బంది కృషికి రైల్వే అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మహేశ్‌ భగవత్‌ అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: చనిపోయి కనిపించిన కొండచిలువ.. శవపరీక్షలో పొట్ట కోయగా.. వామ్మో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..  

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు