Telangana: బంగారు తెలంగాణ సాధించాం: హరీష్‌రావు

|

Jun 02, 2023 | 8:17 PM

2014లో సాధించుకున్న రాష్ట్రం ఇప్పుడు బంగారు తెలంగాణగా అవతరించిందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు కరవుకు నెలవుగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు కరవుకు సెలవు ప్రకటించిందని తెలిపారు.

Telangana: బంగారు తెలంగాణ సాధించాం: హరీష్‌రావు
Harish Rao
Follow us on

2014లో సాధించుకున్న రాష్ట్రం ఇప్పుడు బంగారు తెలంగాణగా అవతరించిందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకప్పుడు కరవుకు నెలవుగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు కరవుకు సెలవు ప్రకటించిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కోటి మెట్రిక్ టన్నుల పంట పండేదని.. తొమ్మిదేళ్లలోనే మూడుకోట్లు మెట్రిక్ టన్నులు పండించే స్థాయికి చేరుకుందని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులను నిర్మించడం వల్లే ఇలాంటి ఘనత సాధ్యమైందన్నారు.

అలాగే రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చేయడం, సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించడం, గోడౌన్లు, కొత్త మార్కెట్ యార్డు నిర్మించామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రైతుబంధు కింద 65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసామని.. దేశంలో రైతులుకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి