Minister Harish Rao: తలసరి ఆదాయ పెరుగుదలలో తెలంగాణ నెంబర్ వన్.. సంచలన ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు

కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు. గత 8 ఏళ్లలో తలసరి ఆదాయం 155 శాతం పెరిగిందని హరీష్ రావు పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో లక్షా 24 వేల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం..

Minister Harish Rao: తలసరి ఆదాయ పెరుగుదలలో తెలంగాణ నెంబర్ వన్.. సంచలన ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు
Minister Harish Rao Exclusive Interview
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:06 PM

అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై టీవీ 9తో మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు. గత 8 ఏళ్లలో తలసరి ఆదాయం 155 శాతం పెరిగిందని హరీష్ రావు పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో లక్షా 24 వేల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23లో 3 లక్షల 17 వేలకు చేరుకుందని అన్నారు. కేంద్రం ఏకాణా ఇయ్యకున్నా స్వీయ శక్తితో ముందుకు సాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రం నలుదికులకూ వికేంద్రీకరిస్తూ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. 2014-15 నుంచి తలసరి ఆదాయాన్ని ఏటేటా గణనీయంగా మెరుగుపరుచుకుంటున్న తెలంగాణ.. ఈ రంగంలో తనకు సాటిలేదని మరోసారి రుజువు చేసుకున్నది.

కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాను మినహాయిస్తే తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశానికే రోల్‌మాడల్‌గా బీజేపీ పదేపదే చెప్తున్న గుజరాత్‌ 11వ స్థానంలో నిలువగా.. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌ అన్ని రాష్ట్రం కంటే అట్టడుగున ఉన్నదన్నారు మంత్రి హరీష్ రావు.

దేశం ఆర్థికంగా ఎదగడానికి నూటికి 64 శాతం మంది ఆధారపడి జీవిస్తున్న రంగాల్లో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు చాలా కీలక భూమిక పోషిస్తున్నాయని అన్నారు మంత్రి హరీష్ రావు.వ్యవసాయ రంగానికి ప్రధానంగా కావలసింది సాగునీరు, సారవంతమైన భూమి, ప్రణాళిక బద్ధమైన వ్యవసాయ విధానం అని అన్నారు. ఈ మూడుంటేనే వ్యవసాయంలో రాణించగలుగుతున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. ఫలితంగా తెలంగాణ నేడు వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతిని సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే సీఆర్‌ ముందుచూపు, ప్రణాళిక బద్ధమైన వ్యవసాయ విధానమే దీనికి కారణం అన్నారు మంత్రి హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం