Business Idea: ఉద్యోగంలో బోర్ కొట్టిందా.. కేవలం లక్ష పెట్టుబడితో నెల నెల రూ.50 వేలపైగా ఆదాయం మీ సొంతం..
వేసవిలో ఐస్ క్యూబ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ డిమాండ్‌ను మనం క్యాష్ చేసుకుంటే మార్కెట్లో నిలబడవచ్చు. వేసవి కాలంలో ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని నెలకొల్పడం ద్వారా బంపర్‌ను సంపాదించుకోవచ్చు. కేవలం వేసవిలోనే మాత్రమే కాదు.. మిగిలిన కాలాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మనం తీసుకునే రూట్ సరైనది అయితే చాలు.. విజయం మీ ముందు సాహో..! అంటూ సలాం చేస్తుంది. ఇలాంటి ఓ చక్కని బిజినెస్ ఐడియాను ఇక్కడ మనం తెలుసుకుందాం..
ఓ మంచి ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది. అలా ఐడియాను పెట్టుబడిగా పెడితే నాచును కూడా ఆహారంగా మార్కెట్లో పెట్టి బిజినెస్ చేయవచ్చు. ఇలాంటి ఓ చక్కని వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తుంటే, వేసవి సీజన్‌లో ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా మీరు బంపర్ సంపాదించవచ్చు. ఇంటి నుంచి జ్యూస్ షాప్ వరకు, పెళ్లి మండపాల నుంచి బార్ వరకు, దాదాపు ప్రతిచోటా ఐస్ క్యూబ్స్ ఉపయోగిస్తున్నారు. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి దీనిని సాధారణంగా చల్లని పానీయాలు, లస్సీ, మజ్జిగ, పండ్లు, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలం పెరుగుతుండడంతో వీటికి డిమాండ్ మరింత పెరగనుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యాపారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పెద్ద ఐస్ క్యూబ్స్ కాకుండా చాలా చిన్న ఐస్ క్యూబ్స్ తయారు చేసి మార్కెట్లోకి ఆరోగ్యకరమైన క్యూబ్స్‌ను అందించవచ్చు.
ఐస్ క్యూబ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీని కోసం, ముందుగా మీరు సమీపంలోని పరిపాలనా కార్యాలయానికి వెళ్లి నమోదు చేసుకోవాలి. దీన్ని ప్రారంభించడానికి మీకు ఫ్రీజర్ అవసరం. దీని తరువాత, రెండవది స్వచ్ఛమైన నీరు, విద్యుత్.
ఐస్ క్యూబ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొన్నింటిపై మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐస్ క్యూబ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి.. మీకు కొన్ని వస్తువులు అవసరం. ఇందులో ఫ్రీజర్, పరిశుభ్రమైన నీరు, విద్యుత్, తగిన స్థలం ఉంటే సరిపోతుంది. ఇవే కాకుండా రకరకాల డిజైన్లలో ఐస్ తయారు చేసుకుంటే.. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.
డిజైన్ ఐస్ క్యూబ్స్ అంటే..
ఇలాంటి ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. పాత కాలం నుంచి మార్కెట్లో లభించే ఐస్ అంటే చాలా మంది ఆందోళన చెందుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఐస్ క్యూస్‌ను రోడ్డు పక్కన పెట్టి కొంత ఉనకలో నిల్వ చేస్తారు. అక్కడ అపరిశుబ్రమైన వాతావరణం ఉంటుంది. అయితే మనం చేయాల్సింది ఇలాంటి ఐస్ క్యూబ్ బిజినెస్ కాదు.
మనం అందించే ఐస్ క్యూబ్స్‌ను నేరుగా డ్రింక్స్‌లో ఉపయోగించవచ్చు. ఇందు కోసం వారు నచ్చే ఆకారాల్లో వాటిని ఉత్పత్తి చేయాలి. క్యూబ్స్ డిజైన్స్‌లో అందిస్తే కస్టమర్లు అధికంగా వస్తారు. దీంతో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తంలో వ్యాపారం సాగుతుంది.
ఒక నెలలో ఎంత సంపాదిస్తారు?
ఐస్ క్యూబ్ వ్యాపారంలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రారంభ దశలో ప్రతి నెలా రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు. పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రూ.50,000 వరకు సంపాదించవచ్చు. మార్కెట్‌ను మరింత అర్థం చేసుకున్న తర్వాత మీ వ్యాపారంకు మంచి మార్కెటింగ్ చేయవచ్చు. ఐస్ క్రీం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పండ్లను నిల్వ చేసే దుకాణదారులను సంప్రదించడం ద్వారా మీరు మీ ఐస్ క్యూబ్స్‌ను విక్రయించవచ్చు. మీరు ప్రజలను చేరుకోవడానికి సోషల్ మీడియా సహాయం తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం