Harish Rao: మెదక్‌ ఆర్టినెన్స్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దు.. కేంద్రానికి మంత్రి హరీష్‌ రావు లేఖ.

మెదక్‌లో ఉన్న ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు కేంద్రానికి లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇతర ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కూడా ప్రైవేటీకరించొద్దని మంత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ను కోరారు. దేశ భద్రతతో పాటు...

Harish Rao: మెదక్‌ ఆర్టినెన్స్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దు.. కేంద్రానికి మంత్రి హరీష్‌ రావు లేఖ.
Minister Harish Rao
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 22, 2023 | 5:11 PM

మెదక్‌లో ఉన్న ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు కేంద్రానికి లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇతర ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కూడా ప్రైవేటీకరించొద్దని మంత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ను కోరారు. దేశ భద్రతతో పాటు ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్రం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హరీష్‌ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే లేఖలో పలు కీలక విషయాలను హరీష్‌ రావు ప్రస్తావించారు.

ఇప్పటికే డిఫెన్స్‌ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని, ఈ కారణంగా నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందని హరీష్‌ అన్నారు. ఇది మేకిన్‌ ఇండియా స్ఫూర్తిని దెబ్బ తీయడం కాదా మంత్రి ప్రశ్నించారు. మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్దగా పని అప్పగించలేదని, దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని “సిక్ ఇండస్ట్రీ” గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగుల, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తెలిపిన ఆరు డిమాండ్లను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలనే డిమాండ్లను హరీష్‌ రావు లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..