AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతులను ఆదుకుంటాం.. తడిసిన ధాన్యం ఎంత ఉన్నా కొనుగోలు చేస్తాం.. మంత్రి గంగుల కమలాకర్..

వర్షాలు, వడగండ్లు.. తెలుగు రాష్ట్రాల రైతులకు కడగండ్లు మిగిల్చాయి. ఓ వైపు పొలాల్లోనే పంట వర్షార్పణం అయ్యింది. మరో వైపు కల్లాల్లోనే పోసిన ధాన్యం మొలకెత్తుతోంది. ధాన్యాన్ని దాచుకునేందుకు రైతుకు స్థలం లేదు, కొనుగోళ్లలో ఆలస్యం అవుతుంది. మొత్తంగా రైతు కంట కన్నీరు కారుతోంది. కష్టం నుంచి బయటపడేది ఎలా? అంటూ విలపిస్తున్నాడు సగటు రైతు.

Telangana: రైతులను ఆదుకుంటాం.. తడిసిన ధాన్యం ఎంత ఉన్నా కొనుగోలు చేస్తాం.. మంత్రి గంగుల కమలాకర్..
Gangula Kamalakar
Shaik Madar Saheb
|

Updated on: May 03, 2023 | 10:57 AM

Share

అకాల వర్షాలు, వడగండ్లు.. అన్నదాతలకు దెబ్బమీద దెబ్బ వేస్తున్నాయి.. కుండపోత వానలతో తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఎకారల్లో పంటనష్టం వాటిల్లింది. పలు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వానలకు తోడుగా గాలి దుమారం తీవ్రంగా చేటు చేసింది. ఏపుగా ఎదిగిన వరి పంట నేలవాలి పూర్తిగా పనికి రాకుండా పోయింది. చాలా చోట్ల వరి గింజలన్నీ నేలరాలి పనికి రాకుండా మారింది.. దెబ్బతిన్న పంటలను చూసి కర్షకులు కంటతడి పెడుతున్నారు. కరీంనగర్ లో ఓ వైపు పొలాల్లోనే పంట వర్షార్పణం అయ్యింది. మరోవైపు కల్లాల్లోనే పోసిన ధాన్యం మొలకెత్తుతోంది. దీంతో ఓ గంగుల కమలాకర్‌ అన్నా.. నీవే మమ్మల్ని ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.. అటు మంత్రి కూడా స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఎఫ్‌సీఐ విధానాల ప్రకారమే వరిధాన్యం కొనుగోలు జరుగుతాయంటున్నారు మంత్రి.. వరిధాన్యం తేమ శాతం 17లోపు ఉంటేనే కొంటామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల దృష్ట్యా తడిసిన ధాన్యం ఎంత ఉన్నా కొనుగోలు చేస్తామని, అన్నదాతలకు ఏమాత్రం ఇబ్బందులు రానీయబోమన్నారు మంత్రి గంగుల కమలాకర్‌ వరిధాన్యం తేమశాతం 17లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామన్నారు. ఎఫ్‌సీఐ విధానాల ప్రకారమే కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని ఎఫ్‌సీఐని కోరినట్లు తెలిపారు.రైతులంతా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. కేంద్ర ఫసల్ బీమాతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..