Telangana: ప్రతిభకు గుర్తింపు.. రాష్ట్రపతి చేతుల మీదుగా బాలశక్తి పురస్కారాలు అందుకున్న తెలుగు రాష్ట్రాల బాలికలు

|

Jan 24, 2023 | 7:15 AM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోలగట్ల మీనాక్షి, తెలంగాణకు చెందిన గౌరవిరెడ్డితో పాటు మొత్తం 11 మంది బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి జాతీయ బాల శక్తి పురస్కారాలు అందుకున్నారు.

Telangana: ప్రతిభకు గుర్తింపు.. రాష్ట్రపతి చేతుల మీదుగా బాలశక్తి పురస్కారాలు అందుకున్న తెలుగు రాష్ట్రాల బాలికలు
Meenakshi And Gauravi Reddy
Follow us on

అసాధారణ విజయాలు సాధించిన 11 మంది పిల్లలకు ప్రధాన మంత్రి బాల శక్తి పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వీరిలో ఇద్దరుతెలుగువారికి కూడా ప్రధాన్‌మంత్రి బాల పురస్కార్‌ అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోలగట్ల మీనాక్షి, తెలంగాణకు చెందిన గౌరవిరెడ్డితో పాటు మొత్తం 11 మంది బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి జాతీయ బాల శక్తి పురస్కారాలు అందుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకున్నారు. చిన్న వయస్సులో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి దేశానికి పేరు తీసుకొచ్చిన బాలలను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ చందరంగం క్రీడాకారిణి కోలగట్ల ఆలన మీనాక్షి 2022 అక్టోబర్‌లో ప్రకటించిన ర్యాంకింగ్స్ 11 ఏళ్ల లోపు వయసు కేటగిరీలో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచింది. ఇక క్రీడల విభాగంలో మీనాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయ బాలల పురస్కారానికి ఎంపికైంది. మరోవైపు ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ కు 2016లో నామినేటైన నృత్యకారిణి ఎం.గౌరవిరెడ్డి అతిచిన్న వయస్సులో ఈ ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కింది. అనేక వేదికలపై శాస్త్రీయ నృత్యరీతులు ప్రదర్శిస్తూ పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో గౌరవిరెడ్డిని కళలు – సంస్కృతి విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బాలల పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది.

11రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఈ 11 మంది బాలల్లో ఆరుగురు బాలురు కాగా, ఐదుగురు బాలికలు. అవార్డు గ్రహీతలు ఒక్కొక్కరికి మెడల్, లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్ ఇస్తారు. ఈ అవార్డు 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలకే పరిమితం చేశారు. సాంస్కృతికం, సాహసం, నూతన ఆవిష్కరణ, పాండిత్యం, సామాజిక సేవ, క్రీడలు, వంటి ఆరు కేటగిరీల్లో అసాధారణ ప్రతిభ చూపించేవారే ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..