ఆడపిల్ల పుడితే రూ.2వేలు.. హామీలు నేరవేర్చకుంటే తొలగించండి.. సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్..
పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కుతోంది.. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు.. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని చాలామంది ఏకగ్రీవం చేసుకునేందుకు గ్రామస్తులను హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కుతోంది.. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు.. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని చాలామంది ఏకగ్రీవం చేసుకునేందుకు గ్రామస్తులను హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. తమపై నమ్మకం కలిగేలా ఏకంగా బాండ్ పేపర్లు సైతం రాసిస్తున్నారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి చేయబోయే పనులు ఇవేనంటూ ఒకరిని మించి మరొకరు బాండ్ పేపర్ల పై హామీలు గుప్పిస్తున్నారు.
మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం రాజుపేట తండా, కాప్రాయిపల్లి గ్రామపంచాయతీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుక్కల మౌనిక 100 రూపాయల బాండ్ పేపర్ పై 15 అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో హామీ పత్రం మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. తనను గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే 2000 రూపాయలు, తీజ్ పండుగ కోసం 20,000 రూపాయలు ముదిరాజ్ బోనాల పండుగకు 8000, ఎల్లమ్మ బోనాల పండుగకు 3000 రూపాయలు ఇస్తానని రాశారు.. అలాగే.. గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే వారికి ఆపద్బాంధు పథకం కింద అంత్యక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని.. తదితర అంశాలతో కూడిన 15 హామీలను 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసిచ్చారు..
ఇవి అమలు చేయకుంటే తనను జిల్లా కలెక్టర్ ద్వారా కానీ.. జిల్లా న్యాయస్థానం ద్వారా గాని తొలగించాలంటూ 100 రూపాయల బాండ్ పేపర్ పై ముద్రించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నారని ప్రజలకు సేవ చేయడం కోసమే ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగిందన్నారు.. గ్రామస్తులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తనకు అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను వేడుకుంటుండం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
