AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మూడు కాళ్లు.. రెండు మలద్వారాలతో జన్మించిన కోడి.. ఆ జిల్లాలో అరుదైన దృశ్యం

జన్యపరమైన లోపాలో లేదా, ప్రకృతి వైపరిత్యం కారణంగానో కొన్ని సార్లు వింత జీవులు భూమ్మీదకు వస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే మెదక్ జిల్లాలలో వెలుగు చూసింది. స్థానికంగా ఫౌల్ట్రీ ఫామ్‌ రన్ చేస్తున్న ఓ రైతు షెడ్డులో మూడు కాళ్లతో జన్మించిన ఓ వింత కోడి పిల్లల దర్శనమిచ్చింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో దాన్ని చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు.

Telangana: మూడు కాళ్లు.. రెండు మలద్వారాలతో జన్మించిన కోడి.. ఆ జిల్లాలో అరుదైన దృశ్యం
Three Legged Chick In Telangana
P Shivteja
| Edited By: |

Updated on: Jun 30, 2026 | 3:04 PM

Share

సాధారణంగా కొన్ని జీవుల పుట్టుకలో కొన్ని ప్రకృతి వైపరీత్యాలు చూస్తూనే ఉంటాం.తాజాగా మెదక్ జిల్లాలో కూడా అలాంటి ఓ వింత సంఘటన వెలుగుచూసింది. శివంపేట మండలం తాళ్లపల్లి తండాలో మూడు కాళ్లు, రెండు మలద్వారాలు ఉన్న ఒక వింత కోడి పిల్ల అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఈ నోటీ ఆనోట ఊరుమొత్తం వ్యాపించడంతో ఈ వింత జీవిని చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున్న తరలివస్తున్నారు. దాని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివంపేట మండలం తాళ్లపల్లి తండాలో నివసించే గుగులోత్ రమేష్ అనే రైతు తన పౌల్ట్రీ ఫామ్‌లో స్నేహ జాతికి చెందిన కోళ్లను పెంచుతున్నాడు. అయితే తన ఫామ్‌లోని కోళ్లను గమనిస్తుండగా, ఒక కోడి పిల్ల నడవడానికి ఇబ్బంది పడటం గమనించాడు. సుమారు 25 రోజుల వయసు గల ఆ కోడి పిల్లను రమేష్ దగ్గరికీ తీసుకోని పరిశీలించగా షాకింగ్ నిజం తెలిసింది.. ఆ కోడికి సాధారణ కోళ్లలా కాకుండా మూడు కాళ్లు, రెండు మలద్వారాలు ఉన్నాయి.

సాధారణంగా రెండు కాళ్లతో ఉండే కోడికి.. వెనుక భాగంలో అదనంగా మరో కాలు, అలాగే రెండు మలద్వారాలు ఉండటాన్ని చూసి యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ విషయం తాళ్లపల్లి తండాలో తెలియడంతో చుట్టుపక్కల ప్రజలు ఈ వింత కోడిని చూసేందుకు రమేష్ పౌల్ట్రీ ఫామ్‌కు క్యూ కడుతున్నారు.

కాగా, జన్యుపరమైన లోపాల వల్ల లేదా పిండం ఎదుగుదల సమయంలో జరిగే మార్పుల వల్లే ఇలాంటి వింత జీవులు పుడతాయని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా, 25 రోజులుగా మూడు కాళ్లతో ఆరోగ్యంగా తిరుగుతున్న ఈ కోడి పిల్ల ఇప్పుడు మెదక్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us