Wedding Season: పెళ్లిళ్ల సీజన్.. ఇది యాపారం..3 నెలల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. 3 నెలల్లో లక్ష వివాహాలు జరగనున్నాయి. ఈ వివాహ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంది. ఈ కారణంగా వివాహాల కోసం ఫంక్షన్ హాల్స్, దేవాలయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. మంచి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నందువల్ల ప్రీ బుకింగ్స్ ఊపందుకున్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. కానీ మంచి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నందువల్ల ప్రీ బుకింగ్స్ ఊపందుకున్నాయి . 3 నెలల్లో లక్ష వివాహాలు జరగనున్నాయి. ఈ వివాహ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంది. ఈ కారణంగా వివాహాల కోసం ఫంక్షన్ హాల్స్, దేవాలయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం, ఈ ఏడాది చాలా తక్కువ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు జరగలేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మంచి ముహూర్తాలు అక్టోబర్ 16, 18, 24, 27, నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 17, 25, డిసెంబర్ 4 నుంచి 7 వరకు ఉన్నాయి. ఈ తేదీల్లో నవంబర్ 8, 10, డిసెంబర్ 6 అత్యంత శుభ ముహూర్తాలుగా ఉన్నాయి.
మంచి తేదీల్లో పెళ్లి చేసుకోవాలనుకున్న కుటుంబాలు హాల్స్ లేదా ఫంక్షన్ ప్లేస్ లభించకపోతే ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివాహాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, కొంత మంది పూజారులు ఒకే రోజు రెండు పెళ్లిళ్లను కూడా జరుపుతున్నారు. వివాహల సీజన్ కావటంతో ఫొటోగ్రఫీకి సైతం భారీ డిమాండ్ ఏర్పడింది. మధ్యతరగతి కుటుంబాలకు ఫంక్షన్ హాల్ ధరలు కట్టుకోవడం కూడా కష్టంగా మారింది. హైదరాబాద్‌లో హాల్ ధరలు అధికంగా ఉండడంతో కొందరు కుటుంబాలు తమ వివాహ వేడుకను వధువు ఇంట్లో జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొంతమంది తమ పెళ్లిళ్లను కమ్యూనిటీ భవనాల్లో లేదా ఇళ్ల ముందు ఖాళీ ప్రదేశాల్లో జరుపుతున్నారు.