Warangal: తనిఖీలు చేస్తుండగా.. ఆ ఇంటి మేడ వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ జాగిలాలు.. కట్ చేస్తే..
అలవాటు ఉంది.. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తెచ్చుకోవడం సమస్యగా మారింది. ఖర్చ కూడా తడిసి మోపెడు అవుతుంది. వీటన్నింటికీ మించి పోలీసులు టెన్షన్. ఈ సమస్యలు అన్నింటికి చెక్ పెట్టేందుకు ఈ వరంగల్ వాసికి బుర్రకు పని పెట్టాడు.
బిల్డింగ్‌లపైన పూల మొక్కలు.. పండ్లు.. కూరగాయల మొక్కలు పెంపకం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం.. కానీ వీడు అదో టైపు.. ఏకంగా మేడపైన గంజాయి పెంచాడు.. మూడో కంటికి తెలియకుండా పెంచుతున్న ఆ గంజాయిని యాంటీ డ్రగ్స్ టీం జాగిలాలు పసిగట్టాయి.. ఇంకేముంది అడ్డంగా బుక్కై కటకటాల పాలయ్యారు.. వరంగల్‌లోని శివనగర్ ప్రాంతంలో ఘటన జరిగింది. పల్లెబోయిన కుమార్ అనేవ్యక్తి మేడ పైన గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారంతో యాంటీ డ్రగ్స్ టీమ్ దాడులు నిర్వహించారు. మత్తు పదార్థాలను పసిగట్టే జాగిలాలతో మేడపై గంజాయి సాగు గుర్తించారు..
పూలమొక్కల్లో కలిపి ఈ గంజాయి సాగు చేస్తున్నారు.. ఎవరూ గుర్తించలేని విధంగా పూల కుండీలలో గంజాయి సాగు చేస్తున్నాడు.. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.. యాంటీ డ్రగ్స్ టీం జాగిలాలలో ట్రెరస్‌పైన తనిఖీలు నిర్వహించారు. జాగిలాలు వెళ్లి మేడమైన పూల కుండీలు ఉన్న వద్ద ఆగాయి. తనిఖీలు చేయగా అక్కడి నాలుగు కుండీలలో గంజాయినీ గుర్తించారు. నిందితుడితో పాటు, ఇంటి యాజమానిని కూడా అరెస్ట్ చేశారు.. మిల్స్ కాలని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు..
ఐతే ఈ తరహా గంజాయి సాగు పట్టుబడటం వరంగల్ చరిత్రలోనే ఇదే ప్రథమం.. పోలీసులు, యాంటీ డ్రగ్స్ టీమ్ కూడా ఈ గంజాయి పెంపకం చూసి షాక్ అయ్యారు. కాగా ఎవరైనా మత్తు పదార్థాలను సేవిస్తున్నా, విక్రయిస్తున్నా, తరలిస్తున్నా వెంటనే 8712584473 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని యాంటీ డ్రగ్స్ టీం కోరింది.