AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులను చూసి పేకాటరాయుళ్ల జంప్.. మానేరు వాగులో పడిపోయిన యువకుడు..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ రాజయ్య అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. మానేరు వాగు నీటిలో చాకలి రాజయ్య మృతదేహం లభించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులను చూసి పేకాటరాయుళ్ల జంప్.. మానేరు వాగులో పడిపోయిన యువకుడు..!
Man Dies Maneru
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 19, 2025 | 8:11 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ రాజయ్య అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. మానేరు వాగు నీటిలో చాకలి రాజయ్య మృతదేహం లభించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో పోలీసులు పంట పొలాల్లోని పేకాట స్థావరంపై గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం దాడి చేశారు. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళగా పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఐదుగురు పరిగెత్తుతుండగా వారిని పంట పొలాల వెంట వెంబడించారు. పోలీసులు వెంబడించడంతో వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకలి రాజయ్య పక్కనే ఉన్న మానేరు వాగు చెక్ డ్యాం నీటిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. మిగతా నలుగురు తప్పించుకున్నారు.

అయితే రాత్రి అయినా రాజయ్య ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. ఫోన్ చేసిన స్పందించకపోవడం కుటుంబ సభ్యులు మానేరు వాగు పక్కన ఉన్న పొలం వద్ద వెతికారు. మానేరు వాగులో రాజయ్య అనుమానాస్పదంగా పడి ఉండడం గమనించారు. పోలీసులు వెంబడించి చంపారా.. ఎవరైనా కొట్టి చంపి పడేశారా.. అనే అనుమానాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు.మానేరు వాగులో పడి ఉన్న రాజయ్య మృతదేహాన్ని స్థానికులు పంట పొలాల వెంబడి ఎత్తుకుని రోడ్డుకు తీసుకొచ్చారు. రాజయ్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేట-సిరిసిల్ల ప్రధాన రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?