AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నన్నే ఆపుతావా అంటూ ఇంటి నుంచి పారిపోయిన భర్త.. కట్ చేస్తే ఊహించని దృశ్యం..

సిద్దిపేట పట్టణం దోభిగల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య తనను మద్యం తాగొద్దన్నదని.. మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana: నన్నే ఆపుతావా అంటూ ఇంటి నుంచి పారిపోయిన భర్త.. కట్ చేస్తే ఊహించని దృశ్యం..
Wife And Husband
Shiva Prajapati
| Edited By: |

Updated on: Mar 09, 2023 | 10:48 AM

Share

సిద్దిపేట పట్టణం దోభిగల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య తనను మద్యం తాగొద్దన్నదని.. మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భూంపల్లి సిద్దుకుమార్(32) మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చేవాడు. అయితే, రోజూలాగే బుధవారం కూడా సిద్దుకుమార్ మద్యం సేవించి వచ్చాడు. భార్యను అన్నం పెట్టమని కోరగా.. ఆమె అన్నం పెట్టింది. అయితే, అన్నం తిన్న తరువాత సిద్దుకుమార్.. మళ్లీ మద్యం తాగి వస్తానంటూ భార్య చెప్పి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అతని భార్య అడ్డుకుంది. మద్యం తాగొద్దని బ్రతిమాలింది, వారించింది.

దాంతో ఇద్దరి మధ్య స్వల్ప వాదన జరిగింది. ‘నువ్ నన్ను మద్యం తాగొద్దని ఆపుతున్నావు. నేను చచ్చిపోతా’ అంటూ ఇంటి నుంచి పారిపోయాడు. అయితే, ఇంటి నుంచి వెళ్లిపోయిన సిద్దు కుమార్ కోసం అతని భార్య, బంధువులు భూంపల్లి సాయికృష్ణ, నాగరాజు కలిసి వెతికారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులను ఆరా తీయగా వారు చెప్పిన ప్రకారం వెతికారు. ఇంతలో ఓ బావిలో సిద్దుకుమార్ పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే బావిలోకి అతన్ని బయటకు తీశారు. కానీ, అప్పటికీ జరగాల్సి ఘోరం జరిగిపోయింది. సిద్దుకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
SIP ఇన్వెస్టర్లు ఈ తప్పులు అస్సలు చేయకండి!
SIP ఇన్వెస్టర్లు ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఘుమఘుమలాడే చెట్టినాడ్ స్టైల్‌ కోడిగుడ్డు పులుసు.. ఇలా చేసి తింటే
ఘుమఘుమలాడే చెట్టినాడ్ స్టైల్‌ కోడిగుడ్డు పులుసు.. ఇలా చేసి తింటే
లక్నో టీమ్‌లో ముదురుతున్న కెప్టెన్సీ లొల్లి.. పంత్ పని అయిపోయిందా
లక్నో టీమ్‌లో ముదురుతున్న కెప్టెన్సీ లొల్లి.. పంత్ పని అయిపోయిందా
TG EAPCET 2026 ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
TG EAPCET 2026 ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. నేడు గల్లీ ప్లేయర్ కంటే..
ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ బ్యాటర్.. నేడు గల్లీ ప్లేయర్ కంటే..
క్రేన్‌ కింద నలిగిన కార్మకులు.. ఐదుగురు మృతి.. 11 మందికి సీరియస్!
క్రేన్‌ కింద నలిగిన కార్మకులు.. ఐదుగురు మృతి.. 11 మందికి సీరియస్!
JBL అదిరిపోయే సౌండ్‌బార్స్..డాల్బీ అట్మోస్‌తో ఇక మీ ఇల్లే థియేటర్
JBL అదిరిపోయే సౌండ్‌బార్స్..డాల్బీ అట్మోస్‌తో ఇక మీ ఇల్లే థియేటర్
మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది..
మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది..
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ జంప్.. టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇదే
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ జంప్.. టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇదే
పోలీసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇకపై ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు
పోలీసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇకపై ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు