Harassment: అత్తింటి వేధింపులు.. అన్నదమ్ముల్లతో కొట్టించిన భార్య.. ఇక తట్టుకోలేకపోయిన భర్త చేశాడంటే..
Harassment: వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో..
Harassment: వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్య తన అన్నదమ్ములతో కొట్టించి, తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిందని మనస్తాపానికి గురైన ఓ వివాహితుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంపల్లి గ్రామానికి చెందిన కుర్వ వెంకటయ్య(37)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. అయితే, కొంతకాలంగా వెంకటయ్య కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో భార్య, భర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
మరోవైపు వెంకటయ్య అత్తవారింటి నుంచి కూడా అతనికి వేధింపులు ఎదురయ్యేవి. ఈ క్రమంలోనే వెంకటయ్య బావమరుదులు వచ్చి అతన్ని బాగా కొట్టారని, ఇంట్లో సామాన్లు సైతం తీసుకెళ్లారని వెంకటయ్య తల్లి ఆరోపించింది. ఇంట్లోని వస్తువులన్నీ తీసుకుని వెంకటయ్య భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటయ్య మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత గ్రామ శివారులోని తన పొలం దగ్గర చింత చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పతరికి తరలించారు పోలీసులు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: