India Corona Cases Update: భయపెట్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్.. దేశంలో పెరిగిన మరణాల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..
India Corona Cases Update: భారతదేశంలో కరోనా మహమ్మారి విజంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది.

India Corona Cases Update: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా కొత్తగా కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 53,480 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఇక కరోనా కారణంగా 354 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 100 నుంచి 200 మధ్యనే ఉన్న కరోనా మరణాల సంఖ్య కరోనా సెకండ్ వేవ్‌లో మరింత పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక 24 గంటల్లో 41,280 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలాఉంటే.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,21,49,335 చేరింది. ఇదే సమయంలో 1,14,34,301 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,52,566 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 1,62,468 మంది చనిపోయారు. మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Also read:
Telangana Temperature: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్.. ఆ టైమ్‌లో అస్సలు బయటకు వెళ్లకండి..
Onion Juice for Hair: జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా ?.. డోంట్ వర్రీ.. పరిష్కారం ఇదిగో..!
