రంగారెడ్డి జిల్లాలో భయానక ఘటన.. మిట్ట మధ్యాహ్నం రోడ్డు పక్కన వేపచెట్టుకు వేలాడుతూ మనిషి.. తీరా చూస్తే..
Terrible Incident: రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సౌదీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు పట్టపగలే రోడ్డు పక్కన
Terrible Incident: రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సౌదీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు పట్టపగలే రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారులోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ షఫీ(30) ఉస్మాన్ సాగర్‌లో నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితమే సౌదీ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ.. ఇవాళ రాఘవేంద్ర కాలనీలో రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్జీవంగా చెట్టుకు వేలాడుతున్న సయ్యద్‌ను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. నిత్యం ప్రజలు తిరిగే ఈ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఈ ఘటన స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని చెట్టుకు వేలాడుతున్న సయ్యద మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా సయ్యద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మధ్యాహ్నం ప్రాంతంలో సయ్యద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏవైనా ఉన్నాయా? అనే దానిపై ఆరా తీశారు. అయితే, ఘటనకు సమీపంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో సయ్యద్ మృతిపై క్లారిటీ రాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Also read: