AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లన్న సాగర్‌లో మరో అద్భుత దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రఘునందన్‌ మాటా మంతీ

మల్లన్నసాగర్‌లో జలదృశ్యంతో పాటు... మరో అద్భుతమైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్న సాగర్‌కు వ్యతిరేకంగా మొదట్నుంచీ పోరాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు...

మల్లన్న సాగర్‌లో మరో అద్భుత దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రఘునందన్‌ మాటా మంతీ
Cm KCR, BJP MLA Raghunandan Rao
Janardhan Veluru
|

Updated on: Feb 23, 2022 | 4:03 PM

Share

Mallanna Sagar Project: మల్లన్నసాగర్‌లో జలదృశ్యంతో పాటు… మరో అద్భుతమైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్న సాగర్‌కు వ్యతిరేకంగా మొదట్నుంచీ పోరాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు(MLA Raghunandan Rao)… సీఎం కేసీఆర్‌తో(Telangana CM KCR)తో కలిసి ఈ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. మల్లన్న సాగర్‌ పనులప్రారంభం మొదలు… నిన్న మొన్నటి వరకు ఈ ప్రాజెక్టుపై రఘునందన్ రావు తీవ్రవిమర్శలు గుప్పించారు. ఇవాళ జరిగిన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పక్కనే దర్శనమివ్వడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

అంతేకాదు, అక్కడ వారి మధ్య సంభాషణ.. మాటామంతీ… కలివిడిగా మెలిగిన తీరు.. ఔరా అనిపించేలా ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌తో రఘునందన్‌ డిస్కస్‌ చేయడం.. ఇదంతా ఆసక్తికరంగా అనిపించింది. ప్రొటోకాల్‌ ప్రకారమే రఘునందన్‌ వచ్చారని అనుకున్నా… ఈ స్థాయిలో కార్యక్రమంలో రఘునందన్‌ కలిసిపోవడం ఆశ్చర్యమే మరి. ఎందుకంటే, మల్లన్నసాగర్‌ను వ్యతిరేకించిన వారిలో.. రఘునందన్‌ టాప్‌లో ఉంటారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఈ అంశాన్ని కూడా బాగా రఘునందన్ రావు వాడుకున్నారు.

సీఎం కేసీఆర్‌తో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాటామంతీ..వీడియో

అలాంటి రఘునందన్‌ ఇవాళ్టి ప్రారంభోత్సవంలో… కార్యక్రమం ఆరంభం మొదలు… చివరి వరకూ అడుగడుగునా సీఎం వెంటే ఉన్నారు. మల్లన్నసాగర్‌ లో ఆవిష్కృతమైన జలదృశ్యం కన్నా .. వీళ్లిద్దరూ కలిసిఉన్న ఫ్రేమ్‌.. కెమెరాలకు కిక్కునిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

Also Read..

Funny Video: గొర్రెను ఓ ఆట ఆడుకున్న యువకుడు.. వీడియో చుస్తే పగలబడి నవ్వుతారు..

RBI: అప్రమత్తంగా ఉండండి.. ఈ యాప్‌ వాడేవారికి రిజర్వ్‌ బ్యాంక్‌ హెచ్చరిక..!