Funny Video: గొర్రెను ఓ ఆట ఆడుకున్న యువకుడు.. వీడియో చుస్తే పగలబడి నవ్వుతారు..
మనం కడుపుబ్బా నవ్వుకోవడానికి నిత్యం వదల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలగురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కోకొల్లలు.
Funny Video: మనం కడుపుబ్బా నవ్వుకోవడానికి నిత్యం వదల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలగురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కోకొల్లలు. చాలా మంది జంతువులతో సరదాగా గడపడానికి ఇష్టపడుతుంటారు. పెపుడు జతువులను ఆటపట్టిస్తూ.. చాలా ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో మనం చూడవచ్చు. ఈ వీడియో కూడా అలాంటిదే. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు అనడంలో సందేహం లేదు. ఈ సరదా వీడియోను కొన్ని సెకన్ల వ్యవధిలో లక్షల మంది వీక్షించారు మరియు లైక్ చేసారు. ఈ వీడియోకు సోషల్ మీడియా అభిమానుల నుంచి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకు ఆ వీడియోలో ఏమున్నదంటే..
ఈ ఫన్నీ వీడియోలో ఓ గొర్రెల మంద దగ్గరకు అకస్మాత్తుగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ని చుసిన ఓ గొర్రె అతడిపైకి దాడి చేయడానికి వచ్చింది. అది అతడి ఢీకొట్టడానికి వచ్చిన సమయంలో వెంటనే అతడు పైకి ఎగిరాడు. ఆ గొర్రె అతడి కాళ్ళ మధ్య నుంచి వెళ్ళింది. మళ్ళీ ఆ గొర్రె తిరిగి వెనక్కి వచ్చి అతడిని ఢీ కొట్టాడని ప్రయత్నించింది.. అతడు మళ్లీ అదే విధంగా గొర్రెను బోల్తా కొట్టించాడు. ఆ గొర్రె ను ఆ యువకుడు చాలా ఆసక్తికరంగా ఎదుర్కొన్నాడు. ఆ యువకుడు చేసిన సరదా పని వీడియోలో చూడాల్సిందే. చివరికి గొర్రె నుంచి నుంచి తప్పించుకోవడానికి అతను ఎత్తైన ప్రదేశానికి పరిగెత్తవలసి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియోకు 10 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 5,52,083 పైగా లైక్ లు వచ్చాయి. మీరు కూడా ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి: