Viral Photo: మీ మెదడుకు పరీక్ష.. 9=8.? ఈ పజిల్ సాల్వ్ చేస్తే మీరే జీనియస్.!!

ట్రిక్కీ ప్రశ్నలు, చిక్కుముడులు సాల్వ్ చేసేందుకు కష్టంగా ఉన్నప్పటికీ.. వాటి సమాధానాలను కనుక్కోవడంలో వచ్చే మజానే వేరని చెప్పాలి...

Viral Photo: మీ మెదడుకు పరీక్ష.. 9=8.? ఈ పజిల్ సాల్వ్ చేస్తే మీరే జీనియస్.!!
Find It
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2022 | 1:40 PM

ట్రిక్కీ ప్రశ్నలు, చిక్కుముడులు సాల్వ్ చేసేందుకు కష్టంగా ఉన్నప్పటికీ.. వాటి సమాధానాలను కనుక్కోవడంలో వచ్చే మజానే వేరని చెప్పాలి. ఇలాంటి ప్రశ్నలకు కొన్నిసార్లు మేధావులు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేరు. అలాంటి చిక్కుముడులు సోషల్ మీడియాలో కోకొల్లలు. తరచూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ట్రిక్కీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మనలో చాలామందికి చిన్నప్పుడు కూల్ డ్రింక్ బాటిల్స్ మూతలను సేకరించడం అలవాటు. వాటితో చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటుంటారు. ఇక ఆ మూతలతోనే ఓ వ్యక్తి వీడియో ట్రిక్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ టేబుల్‌పై 9 బాటిల్ మూతలు ఉన్నాయి. వాటిని అతడు ఒక చిన్న కర్రతో దగ్గరకు చేర్చి.. చెరో నాలుగుగా రెండు వరుసలు చేశాడు. మరి అయితే తొమ్మిదో మూత ఏమైంది.? ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న అదే.! ఆ మూత ఏమైందోనని నెటిజన్లు వీడియోను ముందుకు.. వెనక్కి ప్లే చేస్తున్నారు. ఎలా అదృశ్యమైందో తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలోని మతలబు ఏంటో మీరూ కనుక్కోండి. లేట్ ఎందుకు ఓసారి వీడియోపై లుక్కేయండి.!

అసలు రహస్యం ఇదే..

వీడియో మొదట్లో మీరు తొమ్మిది మూతలను చూడవచ్చు. అయితే అతడు ఎప్పుడైతే.. మూడో వరుస మూతలను దగ్గరకు జరుపుతాడో.. అందులో నుంచి ఒక మూత అదృశ్యమవుతుంది. అంటే..? మూడో వరుసలోని మధ్యలో ఉన్న మూత.. రెండో వరుసలో ఉన్న దానితో కలిసిపోయినట్లుగా మనోడు ఎడిటింగ్ చేస్తాడు. అందుకే మనకు వీడియో చివర్లో కేవలం 8 మూతలు మాత్రమే కనిపిస్తాయి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!