Khammam: ఛీ ఛీ.. దిగజారిన పంతులమ్మ.. లంచం తీసుకుంటూ పట్టుబడిన హెచ్ఎం.. లక్షల్లో జీతం తీసుకుంటున్నా..

విద్యాబుద్ధులు నేర్పి.. సమాజానికి ఆదర్శంగా ఉండే వారే అడ్డదారులు తొక్కుతున్నారు.. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా.. డబ్బు మీద అత్యాశతో అవినీతికి పాల్పడుతున్నారు.

Khammam: ఛీ ఛీ.. దిగజారిన పంతులమ్మ.. లంచం తీసుకుంటూ పట్టుబడిన హెచ్ఎం.. లక్షల్లో జీతం తీసుకుంటున్నా..
Money
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 25, 2023 | 5:18 PM

విద్యాబుద్ధులు నేర్పి.. సమాజానికి ఆదర్శంగా ఉండే వారే అడ్డదారులు తొక్కుతున్నారు.. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా.. డబ్బు మీద అత్యాశతో అవినీతికి పాల్పడుతున్నారు. తాజాగా.. విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండే పంతులమ్మ అవినీతికి పాల్పడి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మధిర గర్ల్స్ హై స్కూల్ కు చెందిన హెడ్ మాస్టర్ శ్రీదేవి లంచం తీసుకుంటూ దొరికిపోయింది.

మన ఊరు – మన బడిలో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులుకు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు హెచ్ఎం ఎం శ్రీలత 50,000 డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ హెచ్‌ఎంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అందులోనుంచి 25,000 వేల రూపాయలు ఈరోజు లంచం తీసుకుంటుండగా.. అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

హెచ్‌ఎం వద్ద ఉన్న రూ.25 వేలను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై అవినీతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే, ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుంచి హెచ్ఎంలు బిల్లులు చేసేందుకు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..