Telangana: వ్యవసాయ భూముల విలువల్లో మార్పులు.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు.. ఏమేం పెరగనున్నాయంటే!

Telangana: వ్యవసాయ భూముల విలువల్లో మార్పులు.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు.. ఏమేం పెరగనున్నాయంటే!

Land Registration Charges: తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెరగనున్నాయి..

Subhash Goud

|

Jul 06, 2021 | 7:42 AM

Land Registration Charges: తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో వినియోగదారులకు మరింత భారం కానుంది. వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూముల మార్కెట్‌ విలువ పెరుగుదలతో పాటు, రిజిస్ట్రేషన్‌, తత్సంబంధిత దాదాపు 20 రకాల సర్వీసులపై విధించే ఛార్జీలను పెంచనున్నారు. అయితే ప్రతిపాదనల నివేదికపై రిజిస్ట్రేషన్‌ శాఖ తుది కసరత్తు చేస్తోంది.

వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు గరిష్టంగా 50 శాతం పెంపు

కాగా, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్టంగా 50 శాతం వరకు పెరుగనుండగా, ప్రాంతీయ వారీ విలువ ఆధారంగా ఇవి 20 శాతం, 30 శాతం, 40 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. 8 సంవత్సరాల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పెంపు ప్రక్రియ కొనసాగుతోంది.

అయితే 2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ సిద్ధం చేసిన నివేదికలోని అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకుని భూముల విలువను నిర్ధారించనున్నారు.

ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఏం స్పష్టం చేసింది

రాష్ట్రంలో భూముల విలువను పెంచడానికి గల కారణాలకు సంబంధించి వివిధ అంశాలను ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలలో భాగంగా భూముల మార్కెట్‌ విలువ పెంపు ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ చేపట్టి ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. అయితే గత 8 సంవత్సరాలుగా భూముల విలువను సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం రెట్టింపయ్యాయి. కొత్త ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. అయితే సాగునీటి వసతి పెరగడంతో భూముల విలువ భారీగా పెరిగింది. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్‌ వాల్యుయేషన్‌ సలమా కమిటీ భూముల విలువను సవరించాలని ప్రతిపాదించింది.

ఇవి పెరగనున్నాయి..

రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో భూములు, ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంప్‌ డ్యూటీ 4 శాతం ఉండగా, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ 0.5 శాతంగా ఉంది. మొత్తం 6 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయంతో భూముల విలువ పెరగనుంది. అలాగే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, విక్రయ అగ్రిమెంట్‌, డెవలప్‌మెంట్‌, డెవలప్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌, కుటుంబీకుల భూముల రిజిస్ట్రేషన్‌, బహుమతి, టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌, వీలునామా, లీజు సహా ఇతర ఛార్జీలు పెరగనున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Car Loan: కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఈ ఐదు బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు..!

Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu