KTR: తెలంగాణ వాయిస్.. ప్రజలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో మరో ఎన్నికల దంగల్‌ వాతావరణం నెలకొంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సిద్దం చేస్తుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టం చేసుకుంటుంది. ఓటమిపై రివ్యూ చేసుకుంటూనే, పార్లమెంట్ ఎన్నికల సన్నద్దతపై పార్టీశ్రేణులతో చర్చిస్తున్నారు. భేటీలో ఓటమి కారణాలను అభిప్రాయాలుగా కేటీఆర్‌కి చెప్పారు నేతలు.

KTR: తెలంగాణ వాయిస్.. ప్రజలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
KTR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2024 | 7:06 AM

తెలంగాణలో మరో ఎన్నికల దంగల్‌ వాతావరణం నెలకొంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సిద్దం చేస్తుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టం చేసుకుంటుంది. ఓటమిపై రివ్యూ చేసుకుంటూనే, పార్లమెంట్ ఎన్నికల సన్నద్దతపై పార్టీశ్రేణులతో చర్చిస్తున్నారు. భేటీలో ఓటమి కారణాలను అభిప్రాయాలుగా కేటీఆర్‌కి చెప్పారు నేతలు. వాటిల్లో ఒకటి.. కాంగ్రెస్ 420 అబద్దపు హామీలతో ఓడిపోయాం, రెండు బీఆర్‌ఎస్‌పై చేసిన దుష్ర్పచారాలను పూర్తిగా తిప్పికొట్టలేకపోయాం, మూడు.. పార్టీపరంగా లోటుపాట్లను సకాలంలో సరిదిద్దలేకపోయామని.. ఈ మూడు విషయాలను కూలంకషంగా చర్చించారు బీఆర్ఎస్ నేతలు..

మరోవైపు తెలంగాణలో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో.. ఏ కారణం చేత ఓటు వేయాలి ? బీఆర్‌ఎస్‌ ఎంపీలను ఎందుకు గెలిపించాలో చెబుతూ కీలక కామెంట్స్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తెలంగాణ వాయిస్ బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్.. తెలంగాణ గౌరవం, అస్థిత్వం కాపాడాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

గత పది ఏళ్లుగా పార్లమెంట్‌లో బీఆర్ఎస్ కార్యాచరణ చూస్తే.. తెలంగాణ అని మాట ప్రతిధ్వనించింది అంటే దానికి కారణం బీఆర్ఎస్ ఎంపీలేనని చెప్పారు కేటీఆర్. రాష్ట్రప్రజలకు ఏకైక ప్రతినిధి.. ఢిల్లీలో తెలంగాణ వాయిస్ వినిపించేది.. అంటే బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణ ఉంటుంది. కాని బీఆర్ఎస్‌కు న్యూక్లియస్ మాత్రం తెలంగాణే అని చెప్పారు కేటీఆర్. తెలంగాణ సమస్యల పైన, వాటాల కోసం, హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు.

కరీంనగర్ పార్లమెంట్ పై ఇవాళ సమీక్ష..

కాగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలు.. జనవరి 21 వరకు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో భాగంగా.. గురువారం కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..