BRS: ‘ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత రేట్ ఫిక్స్ చేశారు’.? ఫిరాయింపులపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ యమ జోరుగా సాగుతున్నాయి. రన్ రాజా రన్ అంటూ.. కారులోంచి దూకి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు ఎమ్మెల్యేలు. హస్తంపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కి.. బీఆర్ఎస్ నేతలు విపరీతంగా మొగ్గుచూపుతున్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య కోల్డ్ వార్ పీక్స్‌కి చేరింది. నేతల మధ్య మాటల తూటాలతో పాటు ట్వీట్ ఫైట్ కూడా గట్టిగానే నడుస్తోంది. కర్ణాటకలో తమ పార్టీలోకి రారమ్మంటూ ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఇస్తుందట.

తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ యమ జోరుగా సాగుతున్నాయి. రన్ రాజా రన్ అంటూ.. కారులోంచి దూకి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు ఎమ్మెల్యేలు. హస్తంపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కి.. బీఆర్ఎస్ నేతలు విపరీతంగా మొగ్గుచూపుతున్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య కోల్డ్ వార్ పీక్స్‌కి చేరింది. నేతల మధ్య మాటల తూటాలతో పాటు ట్వీట్ ఫైట్ కూడా గట్టిగానే నడుస్తోంది. కర్ణాటకలో తమ పార్టీలోకి రారమ్మంటూ ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఇస్తుందట. మరి తెలంగాణలో పార్టీ మారుతున్న వాళ్లకు మీరెంత ఇస్తున్నారు.? ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత రేట్ ఫిక్స్ చేశారు.? అంటూ ట్వీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీపై చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ.. కాంగ్రెస్ తీరుపై ఫైర్ అయ్యారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్, ట్రిపులార్, కల్కి సినిమా కలెక్షన్లు మించిపోయిదంటూ ఘాటుగా కామెంట్స్ కేటీఆర్. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారాయన.
ఇక బీఆర్‌ఎస్‌కు బై చెప్పి.. హస్తం పార్టీకి నేస్తాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 9 మంది కారు పార్టీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరో గులాబీ నేత గూడెం మహిపాల్‌రెడ్డి సైతం హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికెళ్లి మరీ కలిసారు మహిపాల్‌రెడ్డి. దీంతో ఆయన కూడా జంప్ అంటూ జోరుగా చర్చ నడుస్తోంది. ఏ క్షణంలోనైనా మహిపాల్‌రెడ్డి జంపింగ్ వార్త రావొచ్చని చర్చ జోరుగా వినిపిస్తోంది. ఇక తాజాగా అరికెపూడి గాంధీ చేరికతో బీఆర్ఎస్ నుంచి జంపైన వారికి సంఖ్య త్రిపుల్ హాట్రిక్కు చేరింది. అంతకుముందు ప్రకాశ్ గౌడ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. ఇలా తొమ్మిది మంది హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కి ఆకర్షితులయ్యారు. ఇక రేపో, ఎల్లుండో మరో నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో ట్వీట్ ద్వారా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు కేటీఆర్.
కర్ణాటకలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫుల్ ఫైట్ నడుస్తోంది. పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వెళ్లడంతో.. బీజేపీ తీరుపై కర్ణాటక కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు. తమపార్టీలోకి వస్తే రూ.50 కోట్లు ఇస్తామంటూ.. కాంగ్రెస్ నేతలను బీజేపీ లాక్కోవాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య కామెంట్స్‌నే ట్యాగ్ చేస్తూ.. తెలంగాణ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. పార్టీ మారుతున్న ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత ఫిక్స్ చేశారంటూ..? ఫైర్ అయ్యారు. మొత్తంగా.. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కేటీఆర్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
According to Karnataka CM, BJP is offering ₹ 50 Crore per MLA!! Wonder what the Congress is offering in Telangana
Kya Rate Decide Kiya Aap Ne @RahulGandhi Ji?
After all, Telangana Mein “RR-Tax” Ki Collections #RRR Aur #KALKI2898AD Se Bhi Zyada Hain Na ? pic.twitter.com/ujkHBZuqi8
— KTR (@KTRBRS) July 13, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
