Krishna River Colour Change: స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ల మాదిరిగా ఉండే కృష్ణమ్మ.. రంగు మారింది. ఫలితంగా ప్రజల ఆరోగ్యం, ఉపాధిపై ప్రభావం పడుతోంది. అసలు కృష్ణా నదిలో ఏం జరుగుతుంది. ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.. కొల్లాపూర్ ఏరియా అమరగిరి ప్రాంతంలో కృష్ణా నది తిరుగు జలాలు ఆకుపచ్చ రంగులో మారాయి. దీంతో నది పూర్తిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. ఫలితంగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు వలలు వేసుకోలేకపోతున్నారు. నదిలోని చేపలు కూడా చనిపోతున్నాయి. నదిలోకి చేపల వేటకు వెళ్లే వారు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ నిటినే తాగేందుకు ఉపయోగించడంతో అనారోగ్యం పాలవుతున్నారు.
ఇంత కాలం నీరు నిలకడగా ఉండడం వల్ల రంగు మారిందా? లేక ఎగువ ప్రాంతంలోని ఫ్యాక్టరీలు వదిలిన వ్యర్థాల వల్ల మారిందా తేలాల్సి ఉంది. ప్రతి ఆరు నెలలకోసారి నదిలోని నీరు రంగు మారుతుందని, కానీ ఇలా మారడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. నీటిని అధికారులు పరిశీలించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, కలుషితమైన నీటితో పంటల దిగుబడిలో కూడా మార్పులు వస్తున్నాయి. కృష్ణానది ఆకుపచ్చగా మారడానికి కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల అధికారులు. ముఖ్యంగా తుంగభద్ర నుంచి కృష్ణానదిలోకి వచ్చే నీటిలోనే ఫ్యాక్టరీ వ్యర్థాలు ఉంటున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆఫీసర్లు.
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..