AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బస్టాండ్‌లో మగాళ్ల మధ్య కూర్చోని తేడాగా ప్రవర్తించిన యువతి.. ఆరా తీయగా..

అది తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌. అక్కడికి బుర్ఖా ధరించి వచ్చిన ఓ యువతి మేల్ ప్యాసింజర్స్ మధ్య కూర్చుని కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది. దీంతో ఆర్టీసీ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆపై ఆమె అసలు గుట్టు వీడింది..

Telangana: బస్టాండ్‌లో మగాళ్ల మధ్య కూర్చోని తేడాగా ప్రవర్తించిన యువతి.. ఆరా తీయగా..
Korutla Bus Stand
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 18, 2026 | 7:58 PM

Share

జగిత్యాల జిల్లా కోరుట్లలో సోషల్ మీడియా వైరల్ కావాలనే కోరిక ఒక యువకుడిని మారువేషం దాకా తీసుకెళ్లింది. బుర్ఖా ధరించి బస్టాండ్‌లో తిరిగిన యువకుడిని ఆర్టీసీ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉదయం సమయంలో కోరుట్ల బస్టాండ్‌కు బుర్ఖా ధరించి ఓ వ్యక్తి వచ్చి మహిళ ప్రయాణికుల మధ్య కూర్చొని చిలిపి చేష్టలు అనుమానాలకు దారితీసింది. మొదట సాధారణ ప్రయాణికురాలిగా కనిపించినా, కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పక్కన కూర్చున్న మహిళలు గమనించి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆర్టీసీ సిబ్బంది కొంతసేపు ఆమె చేష్టలను పరిశీలించిన తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని ప్రశ్నించగా సమాధానాల్లో పొంతన లేకపోవడంతో స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ సమయంలో బుర్ఖా వేసుకున్నది మహిళ కాదని, యువకుడేనని తేలింది. మొదట స్నేహితుడి కోసం వేషం వేసుకున్నానని చెప్పిన అతడు, తరువాత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇలా చేశానని ఒప్పుకున్నాడు. సిబ్బంది మహిళల పక్కన కూర్చోవడానికా.. ఉచిత బస్సు ప్రయాణం కోసమా.. లేక దొంగతనాల కోసమా.. అని ప్రశ్నించగా వాటిలో ఏదీ కాదని తెలిపాడు. పోలీసులు బుర్కా వేసుకున్న వ్యక్తి వివరాలను సేకరించగా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన సుమన్‌గా గుర్తించారు. సుమన్ అతని స్నేహితుడు అఖిల్ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. సుమన్ అనే యువకుడితో పాటు అతని స్నేహితుడు అఖిల్‌పై పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.

ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో కొంతసేపు కలకలం నెలకొంది. మారువేషాల్లో తిరుగుతున్న వ్యక్తులు నిజంగా వినోదం కోసమేనా లేదా దురుద్దేశాల కోసమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ కావాలనే ఆశతో చేసే విన్యాసాలు చట్టపరమైన సమస్యలకు దారి తీస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా హైలైట్ కావాలనే తపన ఎంతదూరం తీసుకెళ్తుందో మరోసారి బయటపడింది. లైకులు, వ్యూస్ కోసం యువత అడ్డదారులు పడుతూ చిన్న వినోదం కోసం చేసిన పని కేసుగా మారిన ఘటనగా కోరుట్ల సంఘటన నిలిచింది.

Suman

Suman

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు