KA Paul – Munugode Bypoll: పాపం.. పాల్.. మునుగోడులో ఊహించని పరాభవం.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?
ఇలా ఆట, పాట.. అంతకుమించి వార్నింగ్‌లతో మునుగోడు ప్రచారంలో హైలైట్‌గా నిలిచారు కేఏ పాల్. కోపాలు, తాపాలతో పాటు వెరైటీ వేషాలు, సవాళ్లతో అందరినీ ఆకట్టుకున్నారు.

మునుగోడులో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. హోరాహోరీ పోరులో మునుగోడు మొనగాడుగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నిలిచారు. మునుగోడు ఉపపోరులో కారు దూసుకుపోయింది. ఒకట్రెండు రౌండ్లలో మినహా దాదాపు అన్ని రౌండ్లలోనూ గులాబీ ఆధిక్యం చూపించింది. కౌంటింగ్ మొదలైనప్పటినుంచి టీఆర్‌ఎస్ ఆధిపత్యం చూపించింది. 2, 3 రౌండ్లలో మాత్రమే బీజేపీ స్వల్ప ఆధిక్యం చూపించగలిగింది. మిగతా అన్ని రౌండ్లలోనూ కారు జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉంటే, అన్నిచోట్లా టీఆర్‌ఎస్ ఆధిపత్యం కొనసాగించింది. ప్రతి మండలంలోనూ గులాబీకే పట్టం కట్టారు ఓటర్లు. రౌండ్ రౌండ్‌కీ ఉత్కంఠ కొనసాగినప్పటికీ.. టీఆర్‌ఎస్సే పైచేయి సాధించింది.
హోరాహోరీగా సాగిన మునుగోడు పోరులో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ… భారీ తేడాతో ఓడిపోయింది. 10వేల 113 ఓట్ల తేడాతో ఓడిపోయారు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ అయితే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. సిట్టింగ్ సీటును కోల్పోయిన కాంగ్రెస్… పరువు కూడా కాపాడులేకపోయింది. కేవలం 23వేల ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయింది.
అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..
- TRS: కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి – 96598
- BJP: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి – 86485
- Congress: పాల్వాయి స్రవంతి – 23,624
పాల్‌కు ఘోర పరాభవం..
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో తనదైన స్టైల్లో హల్‌చల్ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, అభ్యర్థి కేఏ పాల్ ఘోర పరాభవం ఎదురైంది. మొదటినుంచి తానే గెలుస్తానంటూ చెప్పిన పాల్‌కు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో కేఏ పాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కౌంటింగ్ మొదలైన కొంతసేపటికే.. విజయోత్సవ ర్యాలీకి అనుమతి కావాలంటూ కోరారు. గెలుపు తనదేనని.. 1,10,000 ఓట్లు వస్తాయంటూ మీడియాకు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పాల్ ప్రచారంలో డాన్స్ చేస్తూ హంగమా చేశారు. ఇంకా రకరకాల వేషధారణలో ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేఖశారు. ఇంకా పోలింగ్ సమయంలో బూత్ దగ్గర తన పది చేతి వేళ్ళకు పది ఉంగరాలు ధరించి.. తన గుర్తును హైలైట్ చేసుకునే ప్రయత్నం చేశారు.




ఇలా ఆట, పాట.. అంతకుమించి వార్నింగ్‌లతో మునుగోడు ప్రచారంలో హైలైట్‌గా నిలిచారు కేఏ పాల్. కోపాలు, తాపాలతో పాటు వెరైటీ వేషాలు, సవాళ్లతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రారంభం నుంచి ఓటర్లలో ఫుల్ జోష్ నింపిన.. పాల్ ఓటర్ల మెప్పు పొందడంలో విఫలమయ్యారు. కేవలం 750 ఓట్లతో సరిపెట్టకున్నారు. ఇంకా అత్యల్ప ఓట్లు సాధించిన వారిలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కంటే సాయన్న 20 ఓట్లతో చివరన నిలిచారు. నోటాకు 482 ఓట్లు వచ్చాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..




