Jagadish Reddy: మునుగోడులో ధర్మమే గెలిచింది.. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు: మంత్రి జగదీష్ రెడ్డి 

ఓటమిని అంగీకరించకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాకులు వెతుకుతున్నారంటూ జగదీష్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దుర్వినియోగానికి పాల్పడింది బీజేపీ నేతలే.. అంటూ జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Jagadish Reddy: మునుగోడులో ధర్మమే గెలిచింది.. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు: మంత్రి జగదీష్ రెడ్డి 
Minister Jagadish Reddy
Follow us

|

Updated on: Nov 06, 2022 | 7:17 PM

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. హోరాహోరీ పోరులో ఒకట్రెండు రౌండ్లలో మినహా దాదాపు అన్ని రౌండ్లలోనూ గులాబీ పార్టీ ఆధిక్యం చూపించింది. 10వేల 113 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్‌ కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. సిట్టింగ్‌ సీటును కోల్పోయిన కాంగ్రెస్‌ కేవలం 23వేల ఓట్లు మాత్రమే సాధించింది. కాగా, మునుగోడు ఫలితంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మునుగోడు ఫలితంతో రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని తేలిపోయిందంటూ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుసగా హ్యాట్రిక్ సాధించామన్నారు. మునుగోడు ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని.. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ ఫలితం నిరూపించిందని జగదీష్ తెలిపారు.

ఓటమిని అంగీకరించకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాకులు వెతుకుతున్నారంటూ జగదీష్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దుర్వినియోగానికి పాల్పడింది బీజేపీ నేతలే.. అంటూ జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు ప్రజలు ఈ దేశానికి వేగుచుక్కలా నిలిచారని చెప్పారు. మునుగోడు ఫలితంతో బీజేపీ పతనం సార్ట్ అయిందన్నారు. మునుగోడు ప్రజలు తమపై పెట్టిన బాధ్యతతో నెరవేరుస్తామని మంత్రి జగదీశ్ తెలిపారు.

కాగా, మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. రిటర్నింగ్‌ అధికారి నిబంధనలు పాటించలేదనీ.. టీఆర్‌ఎస్‌ అధర్మంగా గెలిచినట్టేనని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు మద్యం, నగదు పంచి.. ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తితే పట్టించుకోలేదనీ.. అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అసెంబ్లీనే మునుగోడుకు తీసుకొచ్చానన్నారు. తన రాజీనామా తర్వాతే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్నారు. ఇక నుంచి ప్రజల్లో ఉండి పోరాడతానన్నారు.

ఇవి కూడా చదవండి

దీనికి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటమిని అంగీకరించకుండా.. రాజగోపాల్‌రెడ్డి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అభివృద్ధి కోసం కాదని.. తన స్వలాభం కోసమని.. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని జగదీష్‌ రెడ్డి విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..