Kishan Reddy: వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ 3.0 వంద రోజుల పాలన.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

సెప్టెంబర్ 17.. ప్రత్యేకమైన రోజు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం.. ప్రధానిగా మోదీ 3వసారి బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలతోపాటు మోదీ 3.0 సర్కార్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు పనిచేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy: వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ 3.0 వంద రోజుల పాలన.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Kishan Reddy - PM Modi
Follow us

|

Updated on: Sep 17, 2024 | 5:12 PM

సెప్టెంబర్ 17.. ప్రత్యేకమైన రోజు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం.. ప్రధానిగా మోదీ 3వసారి బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలతోపాటు మోదీ 3.0 సర్కార్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు పనిచేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ 3.0 ప్రభుత్వం మొదటి 100 రోజులు వికసిత్ భారత్ 2047కి సంబంధించిన కీలక కార్యక్రమాలపై దృష్టి సారించినట్లు వివరించారు. ఈ 100 రోజుల్లో వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. పౌర-కేంద్రీకృత నిర్ణయాలు పేద, మధ్యతరగతి, అట్టడుగు వర్గాలకు జీవన సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉంటాయన్నారు. సాంకేతికత ద్వారా సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించడంతోపాటు పాలనా మెరుగుదలపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. బీజేపీ పాలనలో ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు.

అందరికీ కూడు, గూడు, గుడ్డ కల్పించేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ మూడో సారి అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టారని.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఏ పథకానికి ఎంత ఖర్చు చేసిందనే వివరాలను ఆయన వెల్లడించారు. అన్నదాతల సంక్షేమం, మహిళా సంక్షేమం కోసం లక్షలాది కోట్లను కేటాయించినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం 20వేలకోట్లు, నారీ శక్తి కోసం 3లక్షల కోట్లను కేటాయించామన్నారు. యువ శక్తి కోసం 2లక్షల కోట్లను కేటాయించడంతోపాటు.. ముఖ్యంగా ప్రజా సంక్షేమం కోసం లక్షల కోట్లను కేటాయించి.. అభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేస్తున్నట్లు తెలిపారు. దళిత, బహుజన, గిరిజన వర్గాలకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు ఎన్నో పథకాలను ప్రారంభించామని తెలిపారు. మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. విద్యా, వైద్య శాఖలపై ప్రత్యేక చొరవ తీసుకోవడంతోపాటు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అందరికీ విద్యా, వైద్యం అందాలన్నదే తమ సంకల్పమన్నారు. సాంకేతిక యుగంలో మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులు, కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించినట్లు తెలిపారు.

సిటిజన్-ఫస్ట్ అప్రోచ్‌తో పాలన కొనసాగిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించడంతోపాటు.. ప్రజా భద్రతకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పాత చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించామన్నారు. పేపర్ లీక్‌లను నిరోధించడానికి చట్టాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని అణచివేయడాన్ని గుర్తుచేసుకోవడానికి జూన్ 25న ‘సంవిధాన్ హత్యా దివస్’ నిర్వహించనున్నట్లు తెలిపారు.

బీజేపీ పాలనలో జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధి చేశామని కిషన్​రెడ్డి వివరించారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కొసం రూ.15లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. సెల్​ఫోన్ల ఉత్పత్తిలో భారత్​ రెండో స్థానంలో నిలిచిందని కిషన్​రెడ్డి వివరించారు. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సీటీలను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలోనూ ఒక కొత్త రైల్వే లైన్​ను ప్రారంభించామని కిషన్​రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు కేటాయించదని.. అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..