చోరీ చేసి దొరికిన దొంగ.. కొడితే కొట్టారు కానీ.. గ్రామస్తులకు దండం పెట్టి పోయిన దొంగ!

జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.

చోరీ చేసి దొరికిన దొంగ.. కొడితే కొట్టారు కానీ.. గ్రామస్తులకు దండం పెట్టి పోయిన దొంగ!
Starved Thief
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Sep 17, 2024 | 5:33 PM

జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతలో సదరు దొంగ మాత్రం తనకు ఆకలి అవుతుందంటూ కేకలు వేశాడు. దాంతో ఆ యువకులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు ఓ దొంగ. అయితే రోజు మాదిరిగానే ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేస్తున్న సమయంలో అలికిడి అయింది. అదే సమయంలో వినాయకుడిని నిమజ్జనం చేసిన యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు. అలికిడి శబ్దం విన్న ఆ యువకులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.

దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని ఆ దొంగ కేకలు వేశాడు. దీంతో ఆ యువకులు వినాయక నిమజ్జనం కోసం తయారుచేసిన పులిహోరను దొంగకు తినిపించారు. దేహశుద్ధి చేసిన అనంతరం నార్కట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. దొంగను పోలీసులకు అప్పగించి కటకటాలపాలు చేసినప్పటికీ.. కొడితే కొట్టారు కానీ తన ఆకలిని తీర్చారంటూ ఆ దొంగ గ్రామస్తులకు దండం పెడుతూ కృతజ్ఞతలు తెలిపాడు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
ప్రతిరోజూ ఉదయాన్నే ఒకే ఒక్క వెల్లుల్లిరెబ్బ తింటే.. ఎన్ని లాభాలో
ప్రతిరోజూ ఉదయాన్నే ఒకే ఒక్క వెల్లుల్లిరెబ్బ తింటే.. ఎన్ని లాభాలో