పదవులు నచ్చక రిజైన్ చేసిన వాళ్లను చూశాం. అవినీతి ఆరోపణలు వస్తే పార్టీ నుంచి వైదొలగడం కూడా కామనే. కానీ ఎమ్మెల్యే వేధిస్తున్నారని రాజీనామా చేశారు ఓ అధికార పార్టీ నేత. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మార్కెట్ చైర్మన్ గా కడర్ల గంగా నరసయ్య.. పనిచేస్తున్నారు. మార్కెట్ చైర్మన్‌గా రంగయ్య ఎన్నికై సంవత్సర కాలమైంది. అప్పటి నుంచి తనపై ఎమ్మెల్యే పెత్తనం చలాయిస్తోందని ఆరోపిస్తున్నారాయన. మార్కెట్ వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యే రేఖానాయక్ జోక్యం చేసుకుని.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు రంగయ్య. ఎమ్మెల్యే వేధింపులే కారణంగా చూపుతూ.. పదవికి, టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు రంగయ్య. రాజీనామా పత్రాలను మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డికి పంపారాయన.
ఎమ్మెల్యే రేఖానాయక్ తనను తీవ్ర.. ఆర్థిక, మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆమె తీరుపై విసుగు చెందిన రంగయ్య.. తన ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే రేఖానాయక్ ఫోటోలను కూడా తీసి పక్కన పడేశారు. ఇన్ని రోజులు మాకు చేసిన సేవలు ఇక చాలు. మీతో కలిసి పని చేయలేను.. మీకో దండం అంటూ ఫోటోలు తీసి పక్కన పడేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు టీఆర్‌ఎస్ నేత రంగయ్య.
తన వేదనను ఎవరితో చెప్పుకున్నా.. పట్టించుకోలేదని.. తీవ్ర కలత చెందిన తర్వాతే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు రంగయ్య చెప్పుకొచ్చారు. తాను ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాననీ.. ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించానని రంగయ్య తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చిన నేతలు తనపై పెత్తనం చేయడం ఏంబాగోలేదన్నారు.
సాధారణంగా అధికార పార్టీ నేతలకు ప్రతిపక్షాల నుంచి.. ప్రజల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఏమాత్రం తప్పులు చేసినా.. ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి. కానీ సొంత పార్టీ నేతలే తనను ఒత్తిడికి గురిచేయడంతో ఆయన మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..