AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏం పాపం చేసిందిరా.. తెల్లవారుజామునే భర్తరూపంలో మింగేసిన మృత్యువు!

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. భార్యపై కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి భార్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు.. అడ్డుకోబోయిన కూతురిపై కూడా దాడి చేశాడు. గమనించిన స్థానికులు అడ్డుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: ఏం  పాపం చేసిందిరా.. తెల్లవారుజామునే భర్తరూపంలో మింగేసిన మృత్యువు!
Khammam News
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 6:28 PM

Share

మద్యానికి బానిసైన తనపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిందనే కోపంతో ఓ వ్యక్తి తను కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఖమ్మంలోని గట్టయ్య సెంటర్‌లో వెలులు చూసింది. భార్య సాయి వాణి (36 )ను భర్త భాస్కర్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసాడు. అడ్డుకోబోయిన కూతురు పై కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు వాణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన ఆమె కూతురిని హాస్పిటల్‌లో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన భాస్కర్‌కు కొన్నేళ్ల క్రితం వాణి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసై.. తరచూ భార్యపై అనుమానంతో వేడిస్తుండేవాడు భాస్కర్. దీంతో భార్య అతనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో గతంలో జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో భాస్కర్‌పై వేధింపులు కేసు కూడా నమోదైంది.

అయినా భాస్కర్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. ఇక వాణి ఖమ్మంలోని ఓ పంక్షన్ హాల్‌లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తుంది. అయితే వాణిపై కోపం పెంచుకున్న భాస్కర్.. గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి.. వాణిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అయితే తల్లిపై దాడి చేస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన కుమార్తెపై కూడా భాస్కర్ దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు