AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒకరి తర్వాత ఒకరు రెండ్రోజుల్లోనే నలుగురు మృతి.. ఇంతకూ ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది!

మూడుముళ్లు వేసి, ఏడడుగులు నడిచి నూరెళ్లు కలిసుందామని ఒక్కటైన భార్యభర్తలు ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలకే విడిపోతున్నారు. లేదా కట్టుకున్నవారిని కడతేర్చుతున్నారు. అదీ చాలదన్నట్టూ ఇద్దరూ కలిసి చనిపోతూ.. లోకం తెలియని పసివాళ్లను కూడా వారి కోపాలకు బలిచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. భార్యభర్తల మధ్యలో మొదలైన చిన్న గొడవలు ఫ్యామిలీ మొత్తం మరణాలకు కారణం అయింది. ఇంతకు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

Telangana: ఒకరి తర్వాత ఒకరు రెండ్రోజుల్లోనే నలుగురు మృతి.. ఇంతకూ ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది!
Khammam Family Tragedy
N Narayana Rao
| Edited By: |

Updated on: May 01, 2026 | 7:53 PM

Share

భార్యభర్తల మధ్యలో మొదలైన చిన్న గొడవలు ఫ్యామిలీ మొత్తాన్ని బలితీసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసిస్తున్న రాము, రమ్య దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె పేరు దివ్యశ్రీ , చిన్న కూతురి పేరు రితిక. అయితే గత కొన్నాళ్లుగా ఈ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈనెల 27న తండ్రి రాము, పెద్ద కుమార్తె దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందగా, తల్లి రమ్య, చిన్న కూతురు రితిక అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రమ్య, రితికను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

అయితే మరుసటి రోజు ఏప్రిల్ 28న రమ్య చికిత్స పొందుతూ హాస్పిటల్‌లోనే మృతి చెందింది. అటు చిన్నారి రితిక పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు చిన్నారిని హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే రితికి కూడా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు నలుగురూ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ఫ్యామిలీ మరణాలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అయితే పురుగుల మందు తాగి భర్త చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తెను హత్య చేసి.. ఆ తర్వాత తల్లి రమ్య ,చిన్న కూతురు రితికకు ఎలుకల మందు తాగించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసుటు చెబుతున్నారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us