Telangana: తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేతకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇప్పటి వరకు వారిపై ఆ కేసులు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సందర్భంగా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు ఉద్యమకారులకు సంబంధించిన కేసుల వివరాలను అందించాలని ఎస్పీలకు డీజీపీ ..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మందిపై కేసులు నమోదు అయ్యాయి. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలోచాలా మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు వారిపై ఆ కేసులు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సందర్భంగా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు ఉద్యమకారులకు సంబంధించిన కేసుల వివరాలను అందించాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు. త్వరలో ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




