Big News Big Debate: తెలంగాణ తీర్పు.. ఏపీలో మార్పు ?? అక్కడ ఎవరి కాన్ఫిడెన్స్‌ వాళ్లది !!

Big News Big Debate: తెలంగాణ తీర్పు.. ఏపీలో మార్పు ?? అక్కడ ఎవరి కాన్ఫిడెన్స్‌ వాళ్లది !!

Phani CH

|

Updated on: Dec 08, 2023 | 6:58 PM

తెలంగాణ ఎన్నికల ఫలితాలు... పక్కరాష్ట్రం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2024 ఎన్నికల్లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ కాబోతోందా? ఇక్కడి తీర్పు.. అక్కడి మార్పునకు శ్రీకారం చుట్టబోతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇలాంటి చర్చకే దారి తీస్తున్నాయి. అయితే, అదేస్థాయిలో వైసీపీ నుంచి కూడా రియాక్షన్స్‌ వస్తుండటంతో... వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు… పక్కరాష్ట్రం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2024 ఎన్నికల్లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ కాబోతోందా? ఇక్కడి తీర్పు.. అక్కడి మార్పునకు శ్రీకారం చుట్టబోతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇలాంటి చర్చకే దారి తీస్తున్నాయి. అయితే, అదేస్థాయిలో వైసీపీ నుంచి కూడా రియాక్షన్స్‌ వస్తుండటంతో… వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ తరహాలోనే… ఏపీలోనూ అధికార మార్పు తథ్యమంటూ ఆయన చేసిన కామెంట్స్‌ కొత్త డిస్కషన్‌కు తెరలేపాయి. మరో మూణ్నెళ్లలో మనదే అధికారమంటూ.. ఆయన ధీమా వ్యక్తం చేయడం టీడీపీలో కొత్త జోష్‌ని నింపుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి.. టీడీపీ శ్రేణులు మద్దతిచ్చాయనీ, అందుకే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందనీ.. ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన పొలిటికల్‌ ముచ్చట. అదెంత వరకు నిజమనేది పక్కనపెడితే.. అదే ఊపుతో.. ఏపీలో కూడా తాము అధికారంలోకి వస్తామంటున్నారు టీడీపీ అధినేత. అయితే దీనికి అదేస్థాయిలో కౌంటరిస్తున్నారు వైసీపీ నేతలు. ఇక, జనసేన, బీజేపీ అలయెన్స్‌పైనా.. సెటైర్లు వేస్తోంది వైసీపీ. కొల్లాపూర్‌లో పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదనీ… నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయనీ… పంచ్‌లు వేస్తోంది. కేఏ పాల్‌ సైతం ఇదే కామెంట్స్‌తో రెచ్చిపోవడం విశేషం. అయితే, ఖమ్మం జిల్లాతో పాటు బాన్సువాడ,నిజామబాద్‌, బోధన్‌ వంటి ఏరియాల్లో… సెటిలర్లు వేసిన ఓట్లవల్లే కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వచ్చిందని రివర్స్‌ కౌంటర్‌ ఇస్తోంది టీడీపీ. అయితే, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచింది కాబట్టి… ఏపీలో తాము గెలవబోతున్నామని టీడీపీ నేతలు చెప్పడంలో అంతరార్థమేంటన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటితో హమాస్‌ సొరంగాలను నింపనున్న ఇజ్రాయెల్‌ !! ఎందుకంటే ??

హమాస్ కర్కశత్వానికి సాక్ష్యం .. కిడ్నాప్ వీడియో రిలీజ్‌

TOP 9 ET News: బలగం వేణుకి బంపర్ ఆఫర్ | వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్

అమ్మాయి ఆత్మహత్య.. పోలీసులకు చిక్కిన కేశవ

రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు