Telangana: 'పాలనలో సమూల మార్పు తెస్తా'.. టీవీ9తో రేవంత్ రెడ్డి

Telangana: ‘పాలనలో సమూల మార్పు తెస్తా’.. టీవీ9తో రేవంత్ రెడ్డి

Ram Naramaneni

|

Updated on: Dec 08, 2023 | 1:02 PM

ఎనుమల రేవంత్‌రెడ్డి...ఉద్యమాల పురిటిగడ్డకు సీఎం అయిన పాలమూరు అడవిబిడ్డ. పార్టీలో చేరిన ఆరేళ్లలోనే ముఖ్యమంత్రి స్థాయికి..అదీ కాకలు తిరిగిన కాంగ్రెస్ సీనియర్స్‌ను దాటుకునిముఖ్యమంత్రిగా దాటుకుని రావడమంటే అంత ఈజీకాదు. రేవంత్ అది చేసి చూపించారు. పాలనలో సమూల మార్పును ఆయన గతంలో టీవీ9 ఇంటర్వ్యూలో తెలిపారు.

హామీలదేముంది నోటిమాట..కానీ అమలు చేయాలంటే నోట్ల మూటలు కావాలి. సంపదను సృష్టించాలి…అభివృద్ధినీ చూపించాలి. ఈరెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగించాలి. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తాము అధికారంలోకి వస్తే.. దళారులు రాజ్యం, సింగిల్ విండో సిస్టమ్ ఉండదని రేవంత్ ఎన్నికలకు ముందు టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. తమది ప్రజల రాజ్యం అని.. ప్రజల పాలన వస్తుందని వివరించారు. ప్రజలు ప్రగతి భవన్‌కు ఎప్పుడైనా, రావొచ్చు పోవచ్చన్నారు. సచివాలయాకు ఎప్పుడైనా వచ్చి.. వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చన్నారు. సమాజంలోని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన మాట నిలబెట్టుకున్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక ఉన్నతే లక్ష్యంగా నేడు ప్రజా దర్బార్ నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Published on: Dec 08, 2023 12:59 PM