Telangana Assembly: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ..
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ మేరకు అక్బరుద్దీన్ తో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ మేరకు ముందుగా అక్బరుద్దీన్ తో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అక్బరుద్దీన్ కు గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం అనంతరం అక్బరుద్దీన్ అసెంబ్లీలో కొత్త MLAలతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..