KCR: కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?

బాత్‌రూమ్‌లో కేసీఆర్‌ కాలు జారిపడటంతో తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు.. ఆయనకు ఆపరేషన్ అవసరమని గుర్తించి.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సుమారు 2 గంటలకు పైనే ఆపరేషన్ జరిగింది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు..

KCR: కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
Telangana Former CM KCR
Follow us

|

Updated on: Dec 08, 2023 | 9:48 PM

పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్.. అనారోగ్యం పాలవడంతో ఆయన ఆభిమానులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రమాదమేమీ లేదని డాక్టర్లు చెప్పినప్పటికీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు. బాత్‌రూమ్‌లో కేసీఆర్‌ కాలు జారిపడటంతో తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు.. ఆయనకు ఆపరేషన్ అవసరమని గుర్తించి.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సుమారు 2 గంటలకు పైనే ఆపరేషన్ జరిగింది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ సతీమణి శోభ సహా కుటుంబసభ్యులంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. పలువురు బీఆర్‌ఎస్ నాయుకులు కూడా ఆస్పత్రి దగ్గరే ఉన్నారు. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను జానారెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థించారాయన. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కేసీఅర్‌ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీని యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో రిజ్వీ మాట్లాడారు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా పోలీస్‌ మానిటరింగ్‌ను పెంచారు.

కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్‌ గాయపడ్డారని తెలిసి బాధ కలిగిందంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం.. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఏపీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. చంద్రబాబు, లోకేష్ సహా పలువురు నేతలు కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకుని సమాజానికి, ప్రజలకు సేవచేయాలని ఆకాంక్షించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. కేసీఆర్‌ చికిత్స పొందుతున్న నేపథ్యంలో యశోద ఆస్పత్రికి అభిమానులు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు హరీష్‌రావు.

ఇవి కూడా చదవండి

సర్జరీ తర్వాత కేసీఆర్

ఆస్పత్రిలో  కేసీఆర్..

హరీశ్ రావు ఏమన్నారంటే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..