AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారబోతుందా..! పార్టీ నుంచి కీలక సంకేతాలు

బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారబోతుందా..! పార్టీ నేతల నుంచి సిగ్నల్స్ అలానే ఉన్నాయి. టీవీ9... 5ఎడిటర్స్‌ కార్యక్రమంలో వినోద్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 80శాతం నేతలు, కేడర్‌... టీఆర్‌ఎస్ పేరే ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌గా మార్చడంపై పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత సమీక్ష జరపనున్నట్లు తెలిపారు.

Telangana: బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారబోతుందా..! పార్టీ నుంచి కీలక సంకేతాలు
TRS Vs BRS
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2024 | 2:45 PM

Share

బీఆర్‌ఎస్‌ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాటలు ఇలాంటి సంకేతాలనే అందిస్తున్నాయి. టీవీ9 నిర్వహించిన 5 ఎడిటర్స్‌ కార్యక్రమంలో పార్టీ పేరు మార్పుపై ఆయన కీలక విషయాలను వెల్లడించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇటీవల వరుసగా జరుపుతున్న రివ్యూ మీటింగ్‌లో 80 శాతం కార్యకర్తలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా చెప్పారు. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలనుకుంటే న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ పేరునే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  అయితే బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా మార్చడంపై, లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు బి. వినోద్‌కుమార్‌.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పేరును మార్చినప్పటికీ.. దేశంలో పూర్తి స్థాయిలో పాగా వేయకలేపోయింది. ఇక మొన్నటి ఎన్నికల్లో అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాదవశాత్తూ జారీ కింద పడ్డారు. నిన్నటికి నిన్న కవిత అరెస్ట్ అయింది. ఈ పరిణామాలతో పేరు మార్చినప్పటి నుంచి పార్టీకి, నేతలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని.. కొందరి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కూడా మళ్లీ పేరు మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి