AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Election: కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా.. నేనా ఫైట్.. గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్!

పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు. దీంతో అధికార పార్టీ కాంగ్రె‌స్‌ ఈ ఎన్నికలను అత్యంత ‌ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీ ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడూ ‌ఎన్నికలు అనగానే సై అనే బీఅర్ఎస్.. ఈసారికి మాత్రం నై అంటుంది. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీ తోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోరు నెలకొంది.

MLC Election: కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా.. నేనా ఫైట్.. గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్!
Mlc Elections
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 10, 2025 | 6:10 PM

Share

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా‌ కొనసాగుతున్నాయి. సోమవారం(ఫిబ్రవరి 10)తో నామినేషన్ల గడుపు ముగిసింది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా పలువురు ఇండిపెండెంట్ లు ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈసారి యాభై మందికి పైగానే బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఅర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నేఫధ్యంలో కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది.

కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాదు, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే ప్రచార స్పీడు ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలో 45 అసెంబ్లీ ‌స్థానాలలో‌ ఉన్న పట్టభద్రులకు సంబంధించి ఈ ఎన్నికలు జరుగనున్నాయి. పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు. దీనితో అధికార పార్టీ కాంగ్రె‌స్‌ ఈ ఎన్నికలను అత్యంత ‌ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీ ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడూ ‌ఎన్నికలు అనగానే సై అనే బీఅర్ఎస్.. ఈసారికి మాత్రం నై అంటుంది. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీ తోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోరు నెలకొంది.

సుమారుగా మూడు లక్షల యాభై ఐదు వేల ఓటర్లు ఉన్నారు. పోలైనా ఓట్లలలో యాభై ఒక్క శాతం వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓటు తమకే వేయాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటిగానే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారం శైలిని కూడా మార్చుతూ, ప్రతి ఒక్క ఓటరును కలుస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ ‌నుండి నరేందర్ రెడ్డి, బీజేపీ నుండి అంజిరెడ్డి, ఇండిపెండెంట్లుగా ప్రసన్న హరికృష్ణ, మాజీ మేయర్ రవిందర్ సింగ్, శేఖర్ రావు తదితరులు బరిలో ఉన్నారు.

ఈ‌ ఎన్నికల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఎన్నికలలో గెలిచిన పార్టీకి స్థానిక సంస్థలలో కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య, అదేవిధంగా తాము‌ ప్రత్యామ్నాయ పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఈ ఎన్నికలు ఎంతో ‌సవాల్. అంతే కాకుండా ఇండిపెండెంట్లు కూడా భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతుందనే ఆందోళన ప్రధాన పార్టీలలో కనిపిస్తోంది.

ఫిబ్రవవరి 27వ తేదిన జరిగే ఈ ఎన్నికలకు ప్రచారానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంది. దీంతో ఓటర్లని అకట్టుకునే పార్టీదే పై చెయ్యిగా నిలిచే అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ ‌కీలక మంత్రులంతా ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అదే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ తోపాటు ముగ్గురు ఎంపీలు ఈ ఎన్నికలపైనా ఫోకస్ పెట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీలతో పోటీ పడి మరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.. చూడాలి మరీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..