AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamareddy:బార్‌లో తుపాకీతో యువకుడు..! దెబ్బకు మత్తువదిలి పారిపోయిన మందుబాబులు

బార్‌లో యువకుడు చేసిన వీరంగానికి మందుబాబులకు దెబ్బకు మత్తు దిగిపోయింది. చేతిలో గన్‌పట్టుకుని యువకుడి చేసిన వీరంగంతో అక్కడి మందుబాబులంతా తలోదిక్కు తప్పించుకు పారిపోయారు. బతికుంటే, మరెప్పుడైనా తాగొచ్చురా బాబోయ్‌ అనుకుని, మత్తు వదిలించుకుని కాళ్లకు పనిచెప్పారు.

Kamareddy:బార్‌లో తుపాకీతో యువకుడు..! దెబ్బకు మత్తువదిలి పారిపోయిన మందుబాబులు
Gun
Jyothi Gadda
|

Updated on: Jun 09, 2022 | 9:41 PM

Share

బార్‌లో యువకుడు చేసిన వీరంగానికి మందుబాబులకు దెబ్బకు మత్తు దిగిపోయింది. చేతిలో గన్‌పట్టుకుని యువకుడి చేసిన వీరంగంతో అక్కడి మందుబాబులంతా తలోదిక్కు తప్పించుకు పారిపోయారు. బతికుంటే, మరెప్పుడైనా తాగొచ్చురా బాబోయ్‌ అనుకుని, మత్తు వదిలించుకుని కాళ్లకు పనిచెప్పారు. బతుకు జీవుడా అని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏ – వన్ బార్ లో చోటుచేసుకుంది. గత కొన్ని నెలల క్రితం ఓ ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి శివారు లో సృష్టించిన వీరంగం మరువక ముందే, తాజా ఘటన సంచలనం రేపుతోంది. నెల క్రితం ఓ దాబా వద్ద భోజనం చేయడానికి వెళుతున్న నలుగురు యువకులను బెదిరించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. తాజాగా నిన్న రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల ఏ – వన్ బార్ లోకి చొరబడ్డాడు అజంపూర్ కాలనీకి చెందిన వ్యక్తి రఫీక్ అనే వ్యక్తి. చేతిలో గన్ పట్టుకుని హల్చల్ చేశాడు. దీంతో అక్కడ మద్యం సేవిస్తున్న మందుబాబులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పారి పోయారు. స్థానికులు అప్రమత్తమై కామారెడ్డి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..గన్‌తో రెచ్చిపోయిన రఫీక్ ను అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ని అక్కడి నుంచి కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువకుడు ఉపయోగించిన గన్, ఎయిర్ గన్‎గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రఫీక్ పై 385 సెక్షను కింద కెసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

అక్రమంగా గన్ కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రఫిక్ వద్ద ఉన్న గన్ ఎయిర్ గా గుర్తించిన పోలీసులు. కామారెడ్డి జిల్లాలో గన్ లైసెన్స్ కలిగిన వారు 27 మంది ఉన్నట్టుగా తెలిపారు. గతంలో రపీక్ పై బంధువులు దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం ఆన్ లైన్ లో ఎయిర్ గన్ కొనుగోలు చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా