AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భార్య కాపురానికి రావట్లేదని సంచలన నిర్ణయం.. భర్త ఏం చేశాడో తెలిస్తే..

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఏడాది నుంచి భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జీవన్ రెడ్డి.. డ్యూటీకి వెళ్తునాని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మొరాయిపల్లి గ్రామ సమీపంలో అతని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: భార్య కాపురానికి రావట్లేదని సంచలన నిర్ణయం.. భర్త ఏం చేశాడో తెలిస్తే..
Tg News
Diwakar P
| Edited By: Anand T|

Updated on: Oct 27, 2025 | 10:19 PM

Share

ఏడాది నుంచి భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి(37) ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అయితే జీవన్ రెడ్డికి ముస్తాబాద్ మండలం మొరాయిపల్లి గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది. వీరికి మోక్ష, కృతిక ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

అయితే భార్య భర్తల మధ్య గత రెండు మూడేళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఏడాది క్రితం చందన తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఎన్నిసార్లు అడిగినా కాపురానికి రాలేదు. ఇటీవల విడాకుల నోటీసులు కూడా రావడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం 7:30 ప్రాంతంలో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైకుపై ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జీవన్ రెడ్డి కామారెడ్డి మండలం గర్గుల్ శివారులోని అడ్లూర్ గోదాం వద్ద గల రాధస్వామి సత్సంగ బ్యాన్ ఆశ్రమం వెనకాల శవమై కనిపించాడు.

పక్కనే బర్ల కాస్తు ఉన్న ఒక వ్యక్తి జీవన్ రెడ్డి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, రూరల్ సిఐ రామన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అక్కడికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి