AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వానికి చేరిన తుది నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏం తేల్చింది!.. తర్వాత ఏం జరగబోతుంది!

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్‌ ఎట్టకేలకు ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించింది. దాదాపు 16 నెలల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్‌ 650 పేజీలకు పైగా నివేదికను రెండు సీల్డ్‌ కవర్లలో ప్రభుత్వానికి అందజేసింది. నివేదికలో కమిషన్ ఏం తేల్చింది..? ఏఏ అంశాలపై కమిషన్‌ నివేదికలో ప్రస్తావించింది అనేది తెలుసుకుందాం పదండి.

ప్రభుత్వానికి చేరిన తుది నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏం తేల్చింది!.. తర్వాత ఏం జరగబోతుంది!
kaleshwaram
Anand T
|

Updated on: Aug 01, 2025 | 8:25 AM

Share

కాళేశ్వరం కమిషన్‌ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. 650 పేజీలకు పైగా తుది నివేదికను రెండు సీల్డ్‌ కవర్లలో ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జాకు అందజేశారు కాళేశ్వరం కమిషన్‌ చీఫ్‌ చంద్రఘోష్‌. దాదాపు 16 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై కమిషన్‌ విచారించింది. నీటిపారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌ రావు, ఈటల రాజేందర్ సహా మొత్తం 119 మందిని విచారించారు పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ నిర్ణయాల మేరకు జరిగిందా లేదా అనే విషయంపై కూడా కమిషన్ దృష్టి సారించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కేబినెట్ మీటింగ్ మినిట్స్‌ను ప్రభుత్వం నుంచి తెప్పించుకుని పరిశీలించింది. కమిషన్ నివేదిక అందడంతో ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ప్రధానంగా మూడు అంశాలను కమిషన్‌ నివేదికలో ప్రస్తావించింది. డిజైన్‌లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేయడం.. హైలెవల్‌ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్‌ రిలీజ్‌ చేసిట్లు నివేదికలో ప్రస్తావించారు. IASలు, ఇంజినీర్ల మధ్య సమన్వయం లోపం.. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్‌ తేల్చింది. మూడు బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేర్వేరుగా పొందుపర్చింది కమిషన్. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది.

ఈ సందర్భంగా కమిషన్ చీఫ్, జస్టిస్ పినాకి చంద్రఘోష్ మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ విచారణలో తన పాత్ర ముగిసిందన్నారు. ప్రభుత్వానికి సూచనలు ఏమీ లేవన్నారు. కమిషన్ ఆర్డర్ ప్రకారం తుది రిపోర్ట్ ఉందన్నారు. రిపోర్ట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తెలీదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో.. అటు ప్రభుత్వ, ఇటు రాజకీయ వర్గాల్లో తర్వాత ఏం జరగబోతుందని తీవ్ర చర్చనీయాశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో ఇలా చేయండి
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?
వర్షాకాలంలో గోడలపై వెనిగర్ స్ప్రే చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
వర్షాకాలంలో గోడలపై వెనిగర్ స్ప్రే చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?