AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట.. 67 రోజుల తర్వాత షరతులతో బెయిల్..!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి లైంగిక వేధింపుల కేసులో 67 రోజుల తర్వాత ఊరట లభించింది. ఉప్పరపల్లి కోర్టు మంగళవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించి, ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ పరిణామంతో కేసు తదుపరి దర్యాప్తు ఆసక్తికరంగా మారింది.

ఎట్టకేలకు ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట.. 67 రోజుల తర్వాత  షరతులతో బెయిల్..!
Trainee Ips Uday Krishna Reddy
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 4:45 PM

Share

హైదరాబాద్: లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో అరెస్టై 67 రోజులుగా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఉప్పరపల్లి కోర్టు మంగళవారం (అక్టోబర్ 06) ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని షరతు విధించారు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆమెను బెదిరించారని వచ్చిన ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 29న నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

కోర్టు ఆదేశాల మేరకు అప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో 67 రోజుల జైలు జీవితం అనంతరం ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో తదుపరి దర్యాప్తు, కోర్టు విచారణ ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి చర్యలను పోలీసులు కొనసాగించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఎందుకో తెలుసా..?
పాలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఎందుకో తెలుసా..?
ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో..
ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో..
ప్రతిరోజూ తాజా కొత్తిమీర కావాలా? ఇంట్లో ఈజీగా పండించేయొచ్చు..
ప్రతిరోజూ తాజా కొత్తిమీర కావాలా? ఇంట్లో ఈజీగా పండించేయొచ్చు..
అల్లం, తులసి కలిపి టీ చేస్తే దగ్గు తగ్గుతుందా? అసలు నిజం ఇదే!
అల్లం, తులసి కలిపి టీ చేస్తే దగ్గు తగ్గుతుందా? అసలు నిజం ఇదే!
ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..!
ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..!
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్
Video: హర్మన్‌ప్రీత్ శతకంపై స్మృతి మంధాన రియాక్షన్..
Video: హర్మన్‌ప్రీత్ శతకంపై స్మృతి మంధాన రియాక్షన్..
ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను వణికిస్తున్న హరర్ థ్రిల్లర్..
ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను వణికిస్తున్న హరర్ థ్రిల్లర్..
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్