Munugode Results: విజయయాత్రకు ముందే పర్మిషన్ తీసుకున్న కేఏ పాల్‌కు ఫస్ట్ రౌండ్‌లో ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?
పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పార్టీల్లో గుబులు రేపుతోంది..మునుగోడులో మొత్తం ఓట్లు 2,41 వేల 805. ఇందులో 2,25 వేల 192 ఓట్లు పోలయ్యాయి. అంటే 93.1 శాతం. అదే 2018 ఎన్నికల్లో 91.3 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 2 శాతం ఓటింగ్ పెరిగింది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం అన్న చర్చ జోరుగా సాగుతోంది.

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రసవత్తరంగా సాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో, ఫస్ట్ రౌండ్‌లో TRS లీడ్ సాధించింది. ఫస్ట్ రౌండ్‌లో TRSకు 6096, బీజేపీ 4904, కాంగ్రెస్ 1877 ఓట్లు పోలయ్యాయి. అయితే తన మార్క్ ప్రచారంతో హోరెత్తించిన స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయని అందరూ సెర్చ్ చేస్తున్నారు. మాకు అందిన డేటా ప్రకారం కేఏ పాల్‌కు కేవలం 34 ఓట్లు పడ్డాయి.

తనకు పోలైన ఓట్లపై పాల్ స్పందించారు. తాను తొలి నుంచి ఈవీఎంల ద్వారా బ్యాలెట్ పేపర్స్‌తో ఎలక్షన్స్ పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఓట్ల అయిన వెంటనే లెక్క పెట్టాలని కోరినా స్పందించలేదన్నారు. సెంట్రల్ ఫోర్స్ ఎన్నికల నిర్వహించాలని కోరానని.. కానీ కేసీఆర్ తొత్తులు ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఈవీఎంలా ట్యాంపరింగ్ జరిగిందని పాల్ ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్తానన్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయాన్నారు.
విజయయాత్రకు ముందే పర్మిషన్
తాను మునుగోడు ఉప ఎన్నికలో గెలుస్తానని ముందు నుంచి ధీమా వ్యక్తం చేశారు పాల్. 50 వేలకు పైచిలుకు మెజార్టీ తనకు వస్తుందన్నారు. ఈ క్రమంలోనే విజయయాత్ర కోసం ఫలితాలకు ముందుగానే పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. కానీ పాల్ ఓడిపోయే సూచనలు కనిపించడంతో.. ఆయన అభిమానులు నిరాశలో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
