YS Sharmila: అంతా వైఎస్ షర్మిల కోరుకున్నట్లే జరిగిందా? ఇంతకీ ఆమె ఎవరు వదిలిన బాణం?

YS Sharmila Arrest Episode: గతంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించిన సందర్భంలో జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల పదేపదే చెప్పుకున్నారు. దీంతో బాణంకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అయితే తన అన్న జగన్ తో విబేధించి..

YS Sharmila: అంతా వైఎస్ షర్మిల కోరుకున్నట్లే జరిగిందా? ఇంతకీ ఆమె ఎవరు వదిలిన బాణం?
YS Sharmila
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2022 | 10:39 PM

YS Sharmila: ‘తాను వదిలిన బాణం తానా అంటే తందాన అంటున్న తామర పువ్వులు..’ అంటూ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్య.. ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నుద్దేశించి కవిత ఈ కామెంట్ చేశారనేది అందరికీ అర్థమైన అంశమే. అయితే నేరుగా షర్మిలను టార్గెట్ చేస్తూ.. ఆమె బీజేపీ వదిలిన బాణం అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు కవిత. గతంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించిన సందర్భంలో జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల పదేపదే చెప్పుకున్నారు. దీంతో బాణంకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అయితే తన అన్న జగన్ తో విబేధించి తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల పై ఇప్పుడు అదే బాణాన్ని ప్రయోగిస్తున్నారు తెలంగాణ నేతలు. ఏకంగా బీజేపీ వదిలిన బాణం షర్మిల అంటూ కొత్త అస్త్రాన్ని తెరమీదికి తెచ్చి ఆమెపై కాషాయ పార్టీకి చెందిన కమలపూవులను విసురుతున్నారు.

షర్మిలపై కాషాయ ముద్ర ఎందుకు?

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ..పాదయాత్ర పేరుతో ఇప్పుడే మూడువేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు షర్మిళ. 2014ఎన్నికల్లో తన అన్న జగన్ జైల్లో ఉన్నపుడు ఆయన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు తెలంగాణలో తాను సొంతంగా పెట్టిన పార్టీ బలోపేతం కోసం పాదయాత్ర చేస్తున్నారు. బహుశా దేశంలో అత్యధిక కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళగా భవిష్యత్తులో ఆమె రికార్డ్ కూడా సృష్టించవచ్చు.

గతంలో తాను జగననన్న వదిలిన బాణం అంటూ చెప్పిన డైలాగ్ జనాల్లోకి విస్తృతంగా వెళ్లింది. కానీ ఇప్పుడు ఆమె బీజేపీ వదిలిన బాణం గా టీఆర్ఎస్ ముద్ర వేయడానికి ఆమెపై కాషాయం రంగు చల్లడానికి అనేక కారణాలున్నాయి.హైదరాబాద్ లో అరెస్ట్ తర్వాత ఆమెకు మద్దతుగా …బీజేపీ నేతలు ట్వీట్లు చేశారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఆమె అరెస్ట్ ను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. దీనికి తోడు గవర్నర్ తమిళ సై కూడా షర్మిలకు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ అటు షర్మిల.. ఇటు బీజేపీపై విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ షర్మిళ గురించి ఎక్కడా కామెంట్ చేయని.. కనీసం విమర్శ కూడా చేయని కల్వకుంట్ల కవిత సైతం ఇపుడు షర్మిలకు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు. ఆమె బీజేపీ వదిలిన బాణం అంటూ అందుకే ఆమె తానా అంటే వీళ్లంతా తందానా అంటున్నారని విమర్శించారు. కవిత కామెంట్ తర్వాత… ఆమెపై కాషాయ ముద్ర పడింది.. మద్దతు తెలిపినంత మాత్రాన ఆమెను బీజేపీ ఏజెంట్ కింద ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే.. ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్‌ను విమర్శిస్తున్నారు తప్ప బీజేపీని ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అనరు.. అనేది టీఆర్ఎస్ వాదన..

ఇవి కూడా చదవండి
Ys Sharmila

Ys Sharmila

షర్మిల కోరుకున్నది అదేనా..??

హైదరాబాద్ లో ఆమె వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు క్రేన్ తో లిఫ్ట్ చేసి భాగ్యనగర వీధుల్లో తీసుకెళ్లడం విపరీతమైన మైలేజ్ తెచ్చిపెట్టింది షర్మిలకు.. ఇన్నాళ్లు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా రాని పబ్లిసిటీ హైదరాబాద్ కార్ లిఫ్టింగ్ ఘటనతో వచ్చింది. నిన్నా మొన్నటి దాకా షర్మిలను ఏ మాత్రం ఖాతరు చేయని.. కనీసం పట్టించుకోని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎదురు దాడి చేస్తోంది. పాదయాత్రలో భాగంగా.. నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డిని విమర్శించడం ,ఆ తర్వాత ఆయన వర్గీయులు ఆమె ప్రచారరధంతో పాటు కార్లపై దాడి, నిప్పు పెట్టడం ఘటనతో ..షర్మిల ఆందోళన చేపట్టారు. ఇందుకు నిరసనగా ఏకంగా ఆ దాడిలో ధ్వంసమైన వాహనాలను తీసుకుని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ షర్మిల ప్రగతిభవన్ కు వచ్చే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఇదే ఆమెకు సానుభూతిని కూడా తెచ్చిపెట్టింది.

మహిళ కారులో కూర్చుంటే ఆ కారును క్రేన్ సాయంతో పోలీసులు లాక్కెళ్లడం అనేది నేషనల్ మీడియా సైతం హైలెట్ చేసేప్పటికీ ఇది నేషనల్ ఇష్యూ అయింది. ఓ రకంగా షర్మిల కోరుకున్నది కూడా అదే అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరూ ఆమెను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఏ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి షర్మిల రాజకీయ ఉనికి కూడా అంతంతమాత్రమే అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆమె పర్యటించినా..అనేక సమస్యల మీద ప్రతి మంగళవారం ఆమె ఆందోళనలు చేసినా..ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఆమె వ్యూహం మార్చారు.. ఏ నియోజకవర్గంలో ప్రచారం చేస్తే అక్కడి ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించారు. ఆమె చేసే విమర్శల దాడికి కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి షర్మిలపై విమర్శలు చేయాల్సి వచ్చింది. ఒక దశలో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఆమెను మంగళవారం మరదలు అంటూ చేసిన విమర్శ తీవ్ర దుమారాన్ని రేపింది. ఒక మహిళ పట్ల ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు షర్మిల. అయితే..చివరికి మంత్రి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు షర్మిల.. ఇక తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి కుట్ర జరిగిందంటూ… సంచలన కామెంట్స్ చేస్తూ ప్రజల అటెన్షన్ ని తనవైపు తిప్పుకునేలా చేశారు. ఇప్పుడు ఏకంగా.. వరంగల్ పాదయాత్రలో నర్సంపేట ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు..ఆమె కారు, ప్రచార రధంపై దాడి చేయడం అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. అయితే మరుసటి రోజు యధావిధిగా పాదయాత్ర చేపడుతుందని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా..ఆమె దాడికి గురైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రచారరధాన్ని తీసుకుని ప్రగతిభవన్ వైపు వచ్చే ప్రయత్నం చేయడం ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారాయి.

Ys Sharmila

Ys Sharmila

అరెస్ట్ తో షర్మిల మైలేజ్ పెగిగిందా..

అసలు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉనికి సాధించడం అసాథ్యమంటూ రాజకీయ విశ్లేషకులు గతంలో అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఆమె సంచలనంగా మారారు. ఇన్నాళ్లు ఎవరైతే తన గురించి కనీసం పట్టించుకోలేదో వాళ్లందర్నీ ఇప్పుడు తన గురించి మాట్లాడేలా చేశారు షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో తన పార్టీ పేరును చేర్చుకోగలిగారు షర్మిల…ఆమెపై ఆంధ్ర మహిళ అనే ముద్ర ఉన్నప్పటికీ అది ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. డైరెక్ట్ గా కేసీఆర్ ను టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం ద్వారా షర్మిల సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు ఆమె కారులో కూర్చుని ఉంటే పోలీసులు ఆమె కారును ట్రాపిక్ వెహికల్ కు కట్టి రోడ్ల మీద లాక్కెళ్లే దృశ్యాలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.  అటు బీజేపీ ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచింది. మహిళను ఇంత దారుణంగా రోడ్డు మీద లాక్కెళ్తారా అనే…పాయింట్‌ను ఆమె హైలెట్ చేసుకుంటున్నారు. అనివార్యంగా అటు కల్వకుంట్ల కవిత, ఇటు టీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు ఆమెపై మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నామొన్నటి దాకా ఆమెను విమర్శిస్తే.. ఆమెను పట్టించుకుంటే ఆమెకు అనవసర మైలేజ్ ఇచ్చినట్టే అవుతుందనుకున్న టీఆరెస్ నేతలంతా ఇప్పుడు ఆమెను ఒక రాజకీయపార్టీ నేతగా గుర్తిస్తున్నారు. ఆమెను విమర్శించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో ఆమెకు చోటు కల్పించారు. హైదరాబాద్ లో కారులాక్కెళ్లిన ఘటనను భవిష్యత్తు రాజకీయాల్లో షర్మిలను విస్తృతంగా తీసుకెళ్లే అవకాశముందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

– అశోక్ వేములపల్లి, అసోసియేట్ ఎడిటర్, టీవీ9

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో