AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses: ఈ బుడ్డోడు చేసిన పనితో కుటుంబానికి జాక్‌పాట్.. ఆహా.. లక్కీ హ్యాండ్ అంటే వీడిది కదా..

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. శుక్రవారం నుంచి ప్లాట్లు కేటాయించేందుకు లక్కీ డ్రా ప్రక్రియ చేపట్టారు. నాలుగు రోజుల పాటు ఈ డ్రా జరగనుంది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అవేంటి అనేది చూద్దాం.

Indiramma Houses: ఈ బుడ్డోడు చేసిన పనితో కుటుంబానికి జాక్‌పాట్.. ఆహా.. లక్కీ హ్యాండ్ అంటే వీడిది కదా..
Indiramma Houses
Venkatrao Lella
|

Updated on: Aug 28, 2026 | 8:51 PM

Share

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తోంది. ఆగస్ట్ 28వ తేదీ నుంచి ఈ డ్రా ప్రారంభమవ్వగా.. ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైలార్ దేవుపల్లిలోని లక్ష్మీగూడలో ఒక బాలుడితో లక్కీ డ్రా తీయించగా.. ఆశ్చర్యకర ఘటన జరిగింది. లక్కీ డ్రా తీసిన పిల్లవాడి కుటుంబానికి ఇల్లు దక్కింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ దీనిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

“ఆగస్ట్ 28వ తేదీన నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించాం. చిన్నారుల చేతుల మీదుగా లక్కీడ్రా టోకెన్లు తీయించాం. అనంతరం ఎంపికైన లబ్దిదారుల పేర్లు ప్రకటించి శుభాకాంక్షలు తెలిపాం. ఈ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేశాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఒక చిన్నోడితో టోకెన్ తీయించగా.. ఆ పిల్లవాడి కుటుంబం పేరే వచ్చింది. నాంపల్లి నియోజకవర్గంలో తొలి టోకెన్ ఒక చిన్నారితో తీపించాను. ఆ తదుపరి తీసిన కొన్ని టోకెన్ల తరువాత.. మొదటి టోకెన్ తీసిన చిన్నారి కుటుంబం కూడా లక్కీడ్రాలో ఎంపికైంది. ఈ రెండు విషయాలు నాకు సంతోషంతో పాటు ఆశ్చర్యాన్ని కల్గించాయి” అని మంత్రి పొంగులేటి ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. లక్కీడ్రా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మంజూరు పత్రాలు అందిస్తారని స్పష్టం చేశారు. అనంతరం 3 నుంచి 4 రోజుల్లోనే టవర్స్‌ నిర్మాణ పనులు మొదవరమ్మ టవర్స్ నిర్మాణంలో ఉన్నప్పుడు లబ్ధిదారులు ఎప్పడైనా వెళ్లి వాటిని చూసుకోవచ్చని తెలిపారు. నిర్మాణాలకు సంబంధించి నాణ్యతను పరిశీలించుకునే హక్కు లబ్దిదారులకు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. పారదర్శకంగా ఫ్లాట్ల నిర్మాణాలు చేపడతామని, ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నాలుగు రోజుల పాటు ఈ లక్కీ డ్రా జరగనుంది. ఈ నెల 31వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తి కానుండగా.. అనంతరం త్వరతగతిన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత లబ్దిదారులు గృహప్రవేశం చేస్తారు. హైదరాబాద్‌లోని 16 నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం క్షేత్రస్థాయి పరిశీలతో ఎవరైనా అనర్హులుగా తేలితే వారి స్థానంలో అర్హులైనవారికి కేటాయిస్తారు.

Follow Us
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
జిమ్‌కు వెళ్లకపోయినా.. డైట్ చేయకపోయినా బరువు తగ్గే మార్గాలివే!
జిమ్‌కు వెళ్లకపోయినా.. డైట్ చేయకపోయినా బరువు తగ్గే మార్గాలివే!